Balayya : బాలయ్య-బోయపాటి …అఖండ -2 కాదట.

నందమూరి (Nandamuri Hero) సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని మంచి జోరులో ఉన్నారు. అఖండ (Akhanda 2), వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్‌ కేసరి వరుస విజయాలతో మరింత స్పీడ్ పెంచారు. ప్రజెంట్ బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2024 | 12:50 PMLast Updated on: Mar 14, 2024 | 12:50 PM

Balayya Boyapati Akhanda 2

నందమూరి (Nandamuri Hero) సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని మంచి జోరులో ఉన్నారు. అఖండ (Akhanda 2), వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్‌ కేసరి వరుస విజయాలతో మరింత స్పీడ్ పెంచారు. ప్రజెంట్ బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. ఎన్బీకే 109 పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాల్తేర్‌ వీరయ్య లాంటి హిట్ తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడం, హ్యాట్రిక్‌ హిట్‌లో ఉన్న బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో.. ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి టైమ్‌లో బాలయ్య నెక్ట్స్ మూవీపై వినిపిస్తున్న రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బాలయ్య కొత్త మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఏప్రిల్‌ 9న బాలయ్య, బోయపాటి మూవీ ప్రారంభం కానుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించబోతుంది. ఆ మధ్య బోయపాటితో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్‌ సినిమాని ప్రకటించింది. హీరో ఎవరనేది చెప్పాలేదు. లేటెస్ట్ న్యూస్‌ ప్రకారం బాలయ్యనే హీరో అని తెలుస్తుంది. అయితే ఈ మూవీ అఖండ2`నా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.. ఎందుకంటే `అఖండ నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. ఆయన ఈ మూవీలో భాగం కాలేదు.. దీంతో.. ఇప్పుడు బోయపాటి బాలయ్యతో చేసే మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. `అఖండ2`నే ఇందులో తెరకెక్కిస్తున్నారా? లేదా కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నారా అన్నది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

కాగా.. బాలయ్య ప్రస్తుతం ఎన్బీకే 109 మీద పూర్తిగా కాన్‌సెన్‌ట్రేట్ చేశారు. ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారు. ఇక.. ఈ మూవీ నుంచి లీకైన బాలయ్య లుక్ సోషల్ మీడియాను షేక్ చేసిందనే చెప్పాలి. ఇందులో యంగ్‌ గా, స్టైలిష్‌గా కనిపించిన నందమూరి అందగాడు.. ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చాడు. చూడాలి మరి.. బాక్సాఫీస్ దగ్గర నందమూరి నటసింహం చేయబోయే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో..