ఎస్ బాలయ్య-బోయపాటి అఖండ సీక్వెల్, ట్విస్ట్ అదిరిపోద్దా…?

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రాజెక్ట్ అంటే చాలు పిచ్చి పీక్స్ లో ఉంటుంది. యాక్షన్ సీన్స్ నుంచి సినిమా కథ వరకు అన్నీ హైలెట్ అవుతూ ఉంటాయి. ఏ రేంజ్ లో బాలయ్యను చూపిస్తాడో అనే ఆసక్తి కూడా జనాల్లో ఓ రేంజ్ లో ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 05:05 PMLast Updated on: Oct 16, 2024 | 5:05 PM

Balayya Boyapati Akhanda Sequel

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రాజెక్ట్ అంటే చాలు పిచ్చి పీక్స్ లో ఉంటుంది. యాక్షన్ సీన్స్ నుంచి సినిమా కథ వరకు అన్నీ హైలెట్ అవుతూ ఉంటాయి. ఏ రేంజ్ లో బాలయ్యను చూపిస్తాడో అనే ఆసక్తి కూడా జనాల్లో ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రతీ సినిమాకు బాలయ్యను డిఫరెంట్ గా చూపించి హిట్ కొట్టాడు బోయపాటి. ఇప్పుడు అఖండ సీక్వెల్ వస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. దీనితో బాలయ్య లుక్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.

పార్ట్ 1 కంటే ఇందులో బాలయ్య కాస్త భిన్నంగా కనపడతాడని టాక్ నడుస్తోంది. అఘోరా పాత్ర అలాగే ఉంచి మరో పాత్ర విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్తారట బోయపాటి. ఆ పాత్ర విషయంలోనే పొలిటికల్ టచ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. మొదటి పార్ట్ లో కాస్త పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చూపించారు. అందులో సుబ్బరాజుని ఎంపీగా చూపించారు. ఇప్పుడు ఆ ఎంపీ స్థానంలో బాలయ్యను చూపిస్తారట. ఎంపీ పదవిలో ఉన్న సుబ్బరాజు మరణించాడు కాబట్టి ఉప ఎన్నికల్లో బాలయ్య ఏకగ్రీవం అయినట్టు ఆ పాత్ర ఉంటుందట.

ఇక ఇందులో దేవాలయాల సంరక్షణ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుందని టాక్. దీనితో సినిమాపై అంచనాలు పీక్స్ కి వెళ్తున్నాయి. బాలకృష్ణ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నటించిన లెజెండ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ సీక్వెల్ కూడా అలా వస్తే కచ్చితంగా హీరో రోల్ పవర్ ఫుల్ గానే ఉంటుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. కొన్ని చోట్ల దేవాలయలపై దాడులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. రాముడి విగ్రహం తల నరకడం, రథం కాల్చడం ఘటనలు ఉన్నాయి.

వాటిని అప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు అనే ఆరోపణ ఉంది. ఇప్పుడు వాటిని కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అఖండ సీక్వెల్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు హిందీ మార్కెట్ ను ఎక్కువగా టార్గెట్ చేసింది చిత్ర యూనిట్. అందుకే హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే విలన్ గా బాబి డియోల్ ని ఎంపిక చేసారని ప్రచారం ఊపందుకుంది.