Akhanda2 : అఖండ-2లో మోక్షజ్ఞ..!
నందమూరి వంశం నూతన తరం నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదారు సంవత్సరాల నుంచి అదిగో వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడు అంటూ ఊరిస్తూ వస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. త్వరలో రాబోతున్న బాలయ్య బాబు అఖండ-2తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

Balayya fans are waiting with a thousand eyes for the entry of Mokshajna, the new generation actor of the Nandamuri dynasty.
నందమూరి వంశం నూతన తరం నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదారు సంవత్సరాల నుంచి అదిగో వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడు అంటూ ఊరిస్తూ వస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. త్వరలో రాబోతున్న బాలయ్య బాబు అఖండ-2తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
మోక్షజ్ఞ తన తొలి సినిమాను ఏ బ్యానర్ లో చేయబోతున్నారు? నిర్మాత ఎవరు? అతన్ని పరిచయం చేసే దర్శకుడు ఎవరు? అన్నదానిపై సంవత్సరాలుగా సస్పెన్స్ కొనసాగుతోంది.. ఇప్పటికే బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలాసార్లు స్పందించారు. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు.. అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.. దీంతో.. ప్రతిసారీ నందమూరి ఫ్యాన్స్‌కు డిజప్పాయింట్‌మెంట్ తప్పడం లేదు.. కానీ.. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర దించుతూ.. బోయపాటి శ్రీను ఆల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే, ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసిన బోయపాటి శ్రీను.. ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
అఖండ 2లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందన్న వార్తతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి పవర్ ఫుల్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ అయితే.. మొదటిసినిమాతోనే రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నారు. అయితే.. ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త నిజమని ఫిక్సయిపోయారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..