బాలయ్యకు మోక్షజ్ఞ తలనొప్పి, ఇద్దరు డైరెక్టర్ల మధ్యలో మోక్షు

ఓవైపు స్టార్ హీరోల వారసులందరూ అన్ని భాషల్లో దుమ్మురేపుతుంటే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ మాత్రమే ఇప్పటివరకు సినిమా అరంగేట్రం చేయలేదు. దాదాపు ఆరు ఏడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 02:05 PMLast Updated on: Dec 11, 2024 | 2:05 PM

Balayya Has A Headache Due To Mokshagna Mokshu Is Between Two Directors

ఓవైపు స్టార్ హీరోల వారసులందరూ అన్ని భాషల్లో దుమ్మురేపుతుంటే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ మాత్రమే ఇప్పటివరకు సినిమా అరంగేట్రం చేయలేదు. దాదాపు ఆరు ఏడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమాను మొదలుపెట్టినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ముందుకు వెళ్లిన పరిస్థితి కనపడలేదు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ.

ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా మొదలవుతుందని అందరూ భావించినా ఆ సినిమా మాత్రం ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. దీంతో సినిమా ఉందా లేదా అనేదానిపై క్లారిటీ రావడం లేదు. దీనితో ఇప్పుడు బాలకృష్ణ… మోక్షజ్ఞ విషయంలో ఏం చేయాలనే దానిపై ఒక స్పష్టతకు రాలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. అటు వెంకీ అట్లూరి కూడా మోక్షజ్ఞ కోసం ఒక కథ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మోక్షజ్ఞ కోసం పవర్ఫుల్ కథను రెడీ చేసి పెట్టారట.

ఆ కథతో సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు బాలకృష్ణ కూడా ఓకే చెప్పడంతో వెంకీ అట్లూరి ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలనేది బాలకృష్ణకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పక్కకు తప్పుకుంటే ప్రభాస్ తో సినిమా మొదలు పెడితే కచ్చితంగా రెండేళ్లు దొరికే అవకాశం ఉండదు. అందుకే ఎలా అయినా సరే ప్రశాంత వర్మ డైరెక్షన్లో తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని బాలయ్య కూడా పట్టుదలగా ఉన్నారట.

హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టాడు. అందుకే బాలకృష్ణ కూడా అతని విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారట. అయితే విభేదాలు ఎక్కడొచ్చాయి, ఎందుకు బ్రేక్ పడింది, అనేదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గతంలో కూడా ప్రశాంత్ వర్మ ఓ బాలీవుడ్ హీరో తో సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయంలోనే బ్రేక్ వేశాడు. మరి ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాను ముందుకు తీసుకువెళ్తాడా లేకపోతే ప్రభాస్ తో సినిమా మొదలు పెడతాడా అనేది తెలియాల్సి ఉంది. అటు బాలకృష్ణ తన కొడుకుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 సీక్వెల్ ను తీసుకురావాలని ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.