నిర్మాతల బెండ్ తీస్తున్న బాలయ్య, రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడు
ఒకప్పుడు గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లో బడ్జెట్ లో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది నిర్మాతలకు. డబ్బు కోసం బాలయ్య సినిమాలు చేయడు అనే పేరు కూడా ఉండేది.
ఒకప్పుడు గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లో బడ్జెట్ లో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది నిర్మాతలకు. డబ్బు కోసం బాలయ్య సినిమాలు చేయడు అనే పేరు కూడా ఉండేది. కాని ఇప్పుడు బాలయ్య అంతా కమర్షియల్ యాంగిల్ లోనే థింక్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్. కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండే బాలయ్య ఆలోచనలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. కారణం అఖండ సినిమా సూపర్ సక్సెస్ కావడం. ఆ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేయడం.
ఆ సినిమా నుంచి బాలయ్య చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. నిర్మాతలకు తన సినిమాలు కాసుల వర్షం కురిపించడంతో ఇక భారీగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేసాడు బాలయ్య. అఖండ సినిమాకు 25 కోట్లకు పైగా బాలయ్య తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ అమౌంట్ ఇంకా ఎక్కువే అనే టాక్ కూడా ఉంది. వీర సింహారెడ్డికి కూడా వసూళ్లు బాగా రావడంతో బాలయ్యకు లాభాల్లో వాటా ఇచ్చారు మేకర్స్. ఆ తర్వాత భగవంత కేసరి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కూడా బాలయ్య 30 కోట్లకు పైగానే తీసుకున్నట్టు టాక్.
ఇప్పుడు అఖండ సీక్వెల్ కు, డాకూ మహారాజ్ 50 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్టు టాక్. కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలయ్య వెనక్కు తగ్గడం లేదు. దీనితో స్టార్ యంగ్ హీరోస్ తో సినిమా బడ్జెట్ ఎంత పెడుతున్నారో బాలయ్య సినిమాలకు కూడా అంతే పెడుతున్నారు నిర్మాతలు. ఇప్పుడు అఖండ సీక్వెల్ కు లాభాల్లో కూడా బాలయ్య వాటా డిమాండ్ చేసినట్టు టాక్. అలాగే సినిమాలు కాకుండా ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నారు.
ఈ షోతో ఆహాకు భారీగా లాభాలు వచ్చాయి. ఆ షో కోసం ముందు బాలయ్య రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సొమ్ము మొత్తం హాస్పిటల్ కు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ కు కూడా బాలయ్య ప్రచారకర్తగా ఉన్నాడు. పలు బ్రాండ్ లకు బాలయ్య ప్రమోషన్స్ చేస్తున్నాడు. గతంలో బాలయ్య లెక్క కాస్త డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు మొత్తం లెక్కలు మారడంతో బాలయ్య కూడా రూటు మార్చి గట్టిగా డిమాండ్ చేయడంతో నిర్మాతల వెన్నులో వణుకు మొదలయింది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదని టాక్.