ఎన్టీఆర్‌ను అవమానించిన బాలయ్య.. మళ్లీ బయటపడిన విభేదాలు..
బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నోవాటెల్‌లో ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు టాలీవుడ్ ఏర్పాట్లు చేస్తోంది.
బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నోవాటెల్‌లో ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు టాలీవుడ్ ఏర్పాట్లు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్న ఈ వేడుకకు… మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.
ఐతే స్వయానా అన్న కొడుకు, సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని మోస్తున్నాడని పేరున్న జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం.. బాలయ్య ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. జూనియర్‌తో పాటు కల్యాణ్‌రామ్‌కు కూడా పిలుపు లేదన్న సమాచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు కల్యాణ్‌రామ్‌ను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దూరం పెడుతున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా.. జూనియర్‌కు పిలుపు అందలేదని వార్తలు వచ్చాయి.
ఇటీవల ఏపీ ఎన్నికల టైంలో టీడీపీకి వ్యతిరేకంగా గానీ, మద్దతుగా గానీ జూనియర్, కల్యాణ్‌రామ్ స్పందించలేదు. ఐతే ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కుటుంబసభ్యులందరికీ ఆహ్వానం అందింది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఐతే ఇప్పుడు 50 ఇయర్స్ వేడుకలకు కూడా ఆహ్వానం అందకపోవడం.. ఎన్టీఆర్‌ను అవమానించినట్లే అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
గతంలోనూ జూనియర్‌ను బాలకృష్ణ దూరం పెట్టారు. శతజయంతి టైంలో ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించాలని ఆదేశించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, వైవీఎస్ చౌదరి లాంటి డైరెక్టర్లు పరోక్షంగా జూనియర్‌పై విమర్శలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని… అసలైన వారసుడు లోకేషేనంటూ బుద్దా వెంకన్న బహిరంగ ప్రకటనలు చేశారు. వైవీఎస్ చౌదరి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన… ఎన్టీఆర్ అయిపోరంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయ్. దీంతో ఉద్దేశపూర్వకంగానే జూనియర్‌ను దూరం పెడుతున్నారన్న చర్చ చాలాకాలంగా జరుగుతోంది.