NTR Balayya : దసరా బరిలో బాలయ్య, జూనియర్..

టాలీవుడ్‌ (Tollywood)లో సంక్రాంతి (Sankantri) ఫైట్ ముగిసింది.. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి మొదటి భాగంతో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ లో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్‌ మాత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) రిలీజ్‌ను ఇప్పటికే లాక్‌ చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2024 | 10:58 AMLast Updated on: Mar 03, 2024 | 10:58 AM

Balayya Junior Ntr To Fight In Dussehra Ring

 

 

 

టాలీవుడ్‌ (Tollywood)లో సంక్రాంతి (Sankantri) ఫైట్ ముగిసింది.. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి మొదటి భాగంతో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ లో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్‌ మాత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) రిలీజ్‌ను ఇప్పటికే లాక్‌ చేసుకున్నాడు. దసరాకి అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా తండేల్‌గా సత్తా చాటాలనుకుంటున్నాడు. ఇప్పుడు దసరా బరిలో నందమూరి సీనియర్ హీరో బాలయ్య సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. జూనియర్ దేవరకు ముందుగానే బాలయ్య థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తాడంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయ్ ఫైట్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికంగా మారింది.

భగవంత్ కేసరితో వరసగా మూడో విజయం అందుకున్న బాలయ్య.. మామూలు జోరు చూపించట్లేదు. పొలిటికల్ బిజీలో ఉండి కూడా నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న షూటింగ్ జెట్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు కానీ అక్టోబర్ మొదటి వారం సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ 3న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. మరి ముందుగా అనుకుంటున్న ప్రకారం దేవర కూడా దసరా బరిలో దిగనుంది. దీంతో.. బాక్సాఫీస్ దగ్గర నందమూరి హీరోల ఫైట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. నిజానికి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొంత గ్యాప్ ఉందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం నందమూరి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరి మధ్యా బాక్సాఫీస్ ఫైట్ పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.

అయితే.. నందమూరి హీరోల మధ్య దసరా బరిలో ఫైట్ పడినప్పటికీ.. అది పెద్దగా ఎఫెక్ట్ చూపదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరి సినిమాలు దసరాకే రిలీజ్ అయినప్పటికీ.. రెండు సినిమాల మధ్య వారం రోజుల గ్యాప్ ఉంటుందంటున్నారు.. బాలయ్య సినిమా హిట్ టాక్ వస్తే మొదటి వారంలో మ్యాక్సిమం కలెక్షన్లు కొట్టేస్తారు కాబట్టి.. దేవర ఎఫెక్ట్ బాలయ్య మూవీపై పడుతుందన్న లెక్క లేదంటున్నారు. సో.. దసరా బరిలో రెండు సినిమాలు ఉన్నప్పటికీ.. అది నందమూరి హీరోల మధ్య ఫైట్‌గా చూడాల్సిన అవసరం లేదంటున్నారు. మరి.. దీని సంగతి పక్కన పెడితే.. దసరా బరిలో ఇద్దరూ ఒకేసారి దిగడానికి అటు బాలయ్య, ఇటు జూనియర్ ఇంట్రెస్ట్ చూపిస్తారా అన్న కొత్త డౌట్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. మరి.. ఈ విషయంపై నందమూరి హీరోలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే..