బాలయ్య-పూరి కాంబినేషన్ రిపీట్, పక్కా గ్రౌండ్ వర్క్ తో పూరి ప్లాన్
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ అనే ఒక సినిమా చేసిన సంగతి తెలిసింది. ఆ సినిమా హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ తో బాగానే ఆడింది.
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ అనే ఒక సినిమా చేసిన సంగతి తెలిసింది. ఆ సినిమా హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ తో బాగానే ఆడింది. ఆ సినిమాతో వీళ్లిద్దరి మధ్య స్నేహం కూడా బలపడింది. ఆ తర్వాత ఇద్దరు ఎక్కడ కనపడిన సరే ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. ఇక బాలకృష్ణ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడనే ప్రచారం కూడా ఎప్పటినుంచొ జరుగుతుంది.
అయితే ఇప్పుడు దానికి పూరి ఒక కథ రెడీ చేసుకుని బాలయ్య తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి డాకు మహారాజ్, మరొకటి అఖండ సీక్వెల్. అఖండ సీక్వెల్ వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్క దాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. సంక్రాంతి తర్వాత పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమాలో బాలయ్య మొదలుపెట్టే ఛాన్స్ కనబడుతోంది.
అయితే పైసా వసూల్ సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అది పైసా వసూల్ లేకపోతే మరొకటా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుత పూరి కష్టాల్లో ఉండటంతో బాలయ్య పూరికి అండగా నిలవాలని రెడీ అయ్యాడట. ఇక ఈసారి పూరీ కూడా బాలయ్య కోసం మంచి పవర్ఫుల్ కథను రెడీ చేసినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో విలన్ గా కూడా ఒక స్టార్ హీరోని పరిచయం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జనవరి వరకు బాలకృష్ణ అఖండ సీక్వెల్లో నటిస్తారని ఆ తర్వాత బోయపాటి ఇతర నటులతో ఆ సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉందని టాక్.
ఈ గ్యాప్ లో బాలయ్య పూరి జగన్నాథ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ ఉండవచ్చని టాక్. 2026 సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేసేందుకు పూరి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి గోపీచంద్ కోసం కూడా ఒక కథ రెడీ చేసినట్టు టాక్ వచ్చింది. ఆ తర్వాత అఖిల్ కోసం కూడా ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడట. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా పెద్దగా ఆడలేదు.