కొరటాలతో బాలయ్య చర్చలు…? మోక్షజ్ఞ రెండో సినిమా…?
టాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ పేరు మార్మోగుతోంది. దేవర సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసిన అందరూ సినిమా సూపర్ హిట్ కావడంతో షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కూడా.
టాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ పేరు మార్మోగుతోంది. దేవర సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసిన అందరూ సినిమా సూపర్ హిట్ కావడంతో షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కూడా. ఇప్పుడు వీకెండ్ ఉండటం, దసరా ఉండటంతో సినిమాకు భారీగా టికెట్ లు బుక్ అవుతున్నాయి. ఇక సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ ప్రచారం చేసినంత లేదని సినిమా బాగుందని మౌత్ టాక్ బాగా కలిసి వచ్చింది. ఇక సినిమా విషయంలో ముందు ఫ్యాన్స్ కూడా డీలా పడ్డారు.
కాని తర్వాత ఫ్యాన్స్ లో కూడా ఓ ఊపు వచ్చింది అనే చెప్పాలి. ఇక వసూళ్లు 800 కోట్లు దాటే అవకాశం ఉందనే టాక్ వస్తోంది. దసరా మూమెంట్ లో అటు హిందీలో కూడా వసూళ్లు భారీగానే పెరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎవరితో చేస్తాడనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. ముందు అల్లు అర్జున్ అనుకున్నారు. అల్లు అర్జున్ కోసం కూడా కథ సిద్దం చేసుకున్నాడని కాని ఆ కథ విషయంలో కాస్త బన్నీ వెనకడుగు వేయడంతో కొరటాల కాస్త సైలెంట్ అయ్యారట.
అటు మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయాలని చూసినా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో బిజీగా ఉన్నాడు. ఈ నేపధ్యంలో కొరటాల శివకు నట సింహం నందమూరి బాలకృష్ణ నుంచి ఫోన్ వచ్చిందని టాక్. తన కొడుకుతో తర్వాత మాస్ సినిమా చేయాలని అనుకుంటున్నా అని… ఆ సినిమాకు కథ రెడీ చేయమని చెప్పారట బాలయ్య. దీనితో కొరటాల ఆ పని మొదలుపెట్టారని తెలుస్తోంది. కమర్షియల్ హంగులతో ఆ సినిమాను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మోక్షజ్ఞ.
ఆ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో కొరటాలతో సినిమా మొదలుపెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ప్రస్తుతం… ప్రశాంత్ వర్మ సినిమా కోసం గట్టి వర్కౌట్స్ చేస్తున్నాడు. యాక్షన్ సీన్స్ విషయంలో బాగా కష్టపడుతున్నాడని అంటున్నారు. ఇక రెండో సినిమా కొరటాల శివతో కాబట్టి కచ్చితంగా యాక్షన్ సీన్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. కాగా ఈ సినిమాను బాలీవుడ్ లో మార్కెటింగ్ చేసేందుకు బాలయ్య గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మోక్షజ్ఞను పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేసే విధంగా కష్టపడుతున్నారని తెలుస్తోంది.