ప్రశాంత్ వర్మ ఇగోనే ఫైనల్.. మోక్షజ్ఞ కోసం బాలయ్య బ్యాక్ స్టెప్

నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆ ఫ్యామిలీ అభిమానులు పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అంటూ పిచ్చెక్కిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 03:47 PMLast Updated on: Jan 08, 2025 | 3:47 PM

Balayyas Back Step For Salvation

నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆ ఫ్యామిలీ అభిమానులు పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అంటూ పిచ్చెక్కిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. బాలకృష్ణ కూడా కొడుకుని ఎలాగైనా సరే సినిమాల్లోకి తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల వద్ద కథలు విన్న బాలకృష్ణ ఏ కదా నచ్చకపోవడంతో… చివరకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమాను మొదలు పెట్టించారు. ఆ సినిమా మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు.

ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకున్నా సరే ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చినా సరే షూటింగ్ మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక బాలకృష్ణతో ప్రశాంత్ వర్మకు విభేదాలు వచ్చాయని అందుకే సినిమా ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది. ఇదే టైంలో పూరి జగన్నాథ తో తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలని కూడా బాలకృష్ణ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఇక ఈ న్యూస్ పై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా ఆగిపోలేదని సరైన సమయంలో ప్రతి అప్డేట్ బయటకు వస్తుందని… సినిమా ముందుకు వెళుతుందని ఆయన అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పుడు సినిమాను ఎలాగైనా సరే ముందుకు నడిపించాలని బాలకృష్ణ కూడా పట్టుదలగా ఉన్నారని… ప్రశాంత్ వర్మ చెప్పిన మార్పులను ఓకే చేసిన బాలయ్య అందుకు మోక్షజ్ఞని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఫిబ్రవరి నుంచి మోక్షజ్ఞ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ప్రస్తుతం సంక్రాంతి హడావుడి ఉండటం, అనవసరంగా ఇప్పుడు మొదలుపెట్టినా సరే గ్యాప్ వస్తుందని భావించిన ప్రశాంత్ వర్మ ఫిబ్రవరి నుంచి మొదలు పెడదామని… ఫిబ్రవరి రెండో వారం నుంచి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళదామని ప్లాన్ చేశారట.

దీనికి బాలయ్య కూడా ఓకే చెప్పేసారు. ఇక ఈ గ్యాప్ లో మోక్షజ్ఞ కోసం మరో కథ కూడా విన్నారు బాలయ్య. లక్కీ భాస్కర్ ఆ సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో తన కొడుకుని మరో సినిమా చేయించేందుకు ఒప్పించారు. మంచి పవర్ఫుల్ కథ కావడం… ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యే కదా కావడంతో బాలయ్య ఆ కథకు ఓకే చెప్పారట. ఆ సినిమాను స్వయంగా బాలకృష్ణ నిర్మించనున్నారు. ఇక ఇదే టైంలో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ కూడా త్వరలోనే ఒక అనౌన్స్మెంట్ రానుంది. అఖండ సీక్వెల్ కంప్లీట్ అయిన తర్వాత బాలకృష్ణ ఆ సినిమాపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ సినిమా సెట్స్ మీదకు వెళితే కచ్చితంగా మరో పండుగ వచ్చినట్టే.