సంక్రాంతి పండగ అంటే మెగా నందమూరి అభిమానులకు వేరే లెవెల్ పండగ. నందమూరి అభిమానులు బాలకృష్ణ సినిమాల కోసం పిచ్చ పిచ్చగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక బాలయ్య కూడా సంక్రాంతికి అభిమానులకు ఒకరకంగా తన వైపు నుంచి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాను రిలీజ్ చేస్తే మెగా ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్న మెగా అభిమానులకు డైరెక్టర్ శంకర్ ఊహించని షాక్ ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా భారీగా హిట్ అవుతుందని వసూళ్లు కచ్చితంగా 1000 కోట్లు సాధిస్తుందంటూ కాలర్ ఎగరేశారు. కానీ అనుకున్న రేంజ్ లో సినిమా రిజల్ట్ లేకపోవడంతో షాక్ అవుతున్నారు మెగా ఫాన్స్. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే డాకూ మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఒకరోజు ముందుగానే వాళ్లకు సంక్రాంతి పండుగ వచ్చేసింది. సినిమాను చాలా కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేసిన బాలకృష్ణ ప్రమోషన్ విషయంలో కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. అయినా సరే సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇక సోషల్ మీడియాలో కూడా నందమూరి అభిమానులు సినిమాకు మార్కెటింగ్ గట్టిగా చేస్తున్నారు. ఇక ఆన్లైన్ బుకింగ్ విషయంలో కూడా ఈ సినిమా మంచి స్పీడ్ మీద ఉంది. బుక్ మై షో యాప్ లో గంటలో 19 వేల టికెట్లు బుక్ చేసింది డాకు మహారాజ్ సినిమా. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజెస్ సినిమా 13 వేల టికెట్లు మాత్రమే బుక్ చేయడంతో మెగా అభిమానులు డీలా పడిపోయారు.. ఒక యంగ్ హీరోకు... సీనియర్ హీరో ఈ రేంజ్ లో షాక్ ఇవ్వడం చూసి నార్మల్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఒక పక్కన యువ హీరోలు కథల విషయంలో ఇబ్బందులు పడుతుంటే బాలయ్య మాత్రం సైలెంట్ గా... లో బడ్జెట్ సినిమాలతో సూపర్ హిట్లు కొడుతూ సవాల్ చేస్తున్నాడు. ఇక డైరెక్ట్ బుకింగ్స్ కూడా సినిమాకు భారీగానే ఉంటున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాను భారీగా బుక్ చేస్తున్నారు. అయితే రెండు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడుతుందా అనేది చెప్పలేని పరిస్థితి. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గానే జరుగుతున్నాయి. వెంకటేష్ కెరీర్ లో ఏ సినిమాకు చేయని ప్రమోషన్స్ ఆ సినిమాకు చేయడం చూసి వెంకటేష్ ఫాన్స్ కూడా కాస్త జోష్ మీదే ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమా కంటే సంక్రాంతి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ పైనే దిల్ రాజు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరి ఆ సినిమా డాకు మహారాజ్ కు ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.[embed]https://www.youtube.com/watch?v=TY2axV9koV4[/embed]