బాలయ్య బాట… ఎన్టీఆర్ కథ… ఒకే దెబ్బకి రెండు పిట్టలు…
పుష్ప తర్వాత పుష్ప2 హిట్ వల్ల బన్నీకి భయం పెరిగిందో, లేదంటే ఆశ ఇంకాస్త ఎక్కువైందో కాని, తను మాత్రం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
పుష్ప తర్వాత పుష్ప2 హిట్ వల్ల బన్నీకి భయం పెరిగిందో, లేదంటే ఆశ ఇంకాస్త ఎక్కువైందో కాని, తను మాత్రం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొన్నటి వరకు ఎర్ర చెందనం చెక్కల స్మగ్లర్ గా కనిపించాడు. ఇప్పుడు సడన్ గా దేవుడి అవతారం ఎత్తుతున్నాడు. అది కూడా అంతా నటసింహం బాలయ్య చలవే… తనకి పాన్ ఇండియా లెవల్లో ఇంకా మార్కెట్ క్రియేట్ కాలేదు. కాని అఖండ తో మాత్రం నార్త్ మొత్తం ఊగిపోయింది. అందుకే అఖండ2 ఏరేంజ్ లో సెన్సేషన్ అవుతుందో అన్న అంచనాలు పెరిగాయి. ఇలాంటి టైంలో అచ్చుగుద్దినట్టు బాలయ్య దారిలో నడుస్తూనే, ఎన్టీఆర్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అల్లు అర్జున్. ఔను తను ఈ సారి పూర్తిగా కోలీవుడ్ ని, బాలీవుడ్ ని కలిపి దున్నేసేందుకు బాబాయ్ అబ్బాయ్ దారిలో నడుస్తున్నాడు. పుష్ప ఎంత హిట్టైనా, కోలీవడ్ లో మాత్రం దూసుకెళ్లలేదు. అందుకే అక్కడి మార్కెట్ ని కొల్లగొట్టాలంటే మురుగనే దిక్కు… అందుకే ఎన్టీఆర్ కథని ఎగరేసుకుపోతున్నాడు… ఒకే బుల్లెట్ కి రెండు పిట్టల్ని టార్గెట్ చేశాడు. అదెలానో చూసేయండి.
నటసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరి దారిలో ఐకాన్ స్టార్ నడిస్తే, అటు కోలీవుడ్ మార్కెట్, ఇటు నార్త్ ఇండియా మార్కెట్ ని క్లీన్ బోల్డ్ చేయొచ్చు… ఇది ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ తీసే సినిమాకు ఐకాన్ స్టార్ వేసిన స్కెచ్ అనంటున్నారు. అంత సిల్లీగా బన్నీ ఎందుకు మరో హీరోని, ఫాలో అవ్వాలనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది
కాని కొన్ని సార్లు కొన్ని పెద్ద విషయాలు మొదట్లో సిల్లీగానే కనిపిస్తాయి. కాని రిజల్ట్ ని బట్టే ఇండస్ట్రీ లో అడుగులు పడతాయి. ఇక్కడ బన్నీ టార్గెట్ కోలీవుడ్ తో పాటు బాలీవుడ్…. ఇంతవరకు తను పుష్పతో సౌత్ ని ఏలాడు.. కాని తమిళ, మలయాళ మార్కెట్లో పుష్పరాజ్ పెద్దగా ఇరగదీసింది లేదు.. రెండు భాగాలు ఆరెండు మార్కెట్లలో బొక్క బోర్లా పడ్డాయి..
తెలుగు, కన్నడ, హిందీ మార్కెట్స్ లోనే పుష్ప జోరు కనిపించింది. ఐతే తమిల, మలయాళ మార్కెట్స్ ని ఆకట్టుకోవాలంటే, అందుకు మురుగనే దారి… అవును త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో బన్నీ చేయబోయేది సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ అని తెలుస్తోంది. తమిళ నాట ఎంత రిజర్వేషన్స్ మీద ఫోకస్ ఉన్నా, ఎంత యాంటీ బ్రాహ్మనిజం ఉన్నా, లార్డ్ మురుగన్ అంటే ఆ భక్తే వేరు
అందుకే మురుగన్ ఈకాలంలో మనలో ఒకడిగా వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఇదొక్కటే రీవీలైంది. మైథాలజీ , ఫాంటసీ ఇలా ఈరెండు జోనర్స్ లో ఈ మూవీ రాబోతోంది.
ఐతే ఈ మూవీ చేయటానికి బన్నీకి ఇన్స్ పిరేషన్ అఖండ 2నే. ప్రజెంట్ నార్త్ ఇండియాలో ఓ మూవీ ఈజీగా హిట్ అవ్వాలంటే డివోషనల్ కాన్సెప్ట్ అయితే చాలు.. కాస్త కథ, ఇంకాస్త మేకింగ్ బాగుంటే, నార్త్ మార్కెట్ ఊగిపోతుంది
కాని డివోషనల్ కాన్సెప్ట్ కి కోలీవుడ్ మార్కెట్ లో అంత డిమాండ్ ఉండదు. కాని మురుగన్ దేవుడి పాత్రతో సినిమా అంటే అరవ అడ్డ అదిరిపోవాల్సిందే… వాళ్ళకా దేవుడంటే ఉండే భక్తి లెవలే వేరు. కాబట్టే ఒకేదెబ్బకి అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ ని టార్గెట్ చేశాడు బన్నీ. ఐతే ఇదే కథ ఎన్టీఆర్ కి ఎప్పుడో చెప్పాడు త్రివిక్రమ్. తను రిజెక్ట్ చేసిన ఈ కథే ఇప్పుడు బన్నీ చేస్తున్నాడు. ఏదేమైనా అఖండ 2 తెరకెక్కే టైంలో, అది రిలీజ్ కి ముందే 500 కోట్లు బిజినెస్ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో… కార్తికేయగా మారిపోతున్నాడు బన్నీ…
సో ఎలా చూసినా డివోషనల్ మూవీలకు డిమాండ్ ఎక్కువని అఖండతో బాలయ్య ప్రూవ్ చేశాడు.అందుకే ఎన్టీఆర్ విన్న కథని, బన్నీ చేసేందుకు రెడీ అయ్యాడు.