బాలయ్య రెమ్యునరేషన్ 80 కోట్లు.. 500 కొట్లంటే మినిమం ఉంటది…!
అఖండ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ రూట్ మారిపోయింది. ఆయన ఏం చెప్తే అదే డైరెక్టర్లు, నిర్మాతలు చేసే పరిస్థితి.
అఖండ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ రూట్ మారిపోయింది. ఆయన ఏం చెప్తే అదే డైరెక్టర్లు, నిర్మాతలు చేసే పరిస్థితి. తనకు కథ నచ్చితే ఆ సినిమా కోసం ఎంతో కష్టపడే బాలయ్య… కథ నచ్చకపోతే ఇప్పుడు రిజెక్ట్ చేసేస్తున్నారు. గతంలో కథ వినకుండానే సినిమాలు చేసిన ఆయన… ఇప్పుడు మాత్రం అలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. దీనితో బాలయ్య సినిమా వస్తుందంటే జనాల్లో క్రేజ్ ఎప్పుడు లేని విధంగా పెరిగిపోయింది. ఇక అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య నార్త్ ఇండియా మార్కెట్ మీద గట్టిగానే ఫోకస్ పెట్టారు.
అందుకే డైరెక్టర్లు కూడా బాలయ్యకు తగ్గ కథలు రాస్తూ కాస్త పవర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమా మినహా భగవంత్ కేసరి అలాగే రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలు ఇతర భాషల్లో కూడా అలరించాయి. ఇక ఇప్పుడు అఖండ సీక్వెల్ విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ సినిమాకు నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ ఉండటంతో మహా కుంభమేళాలో షూటింగ్ చేసిన బోయపాటి… బాలకృష్ణ కోసం పవర్ఫుల్ సీన్స్ ను డిజైన్ చేశాడు. త్వరలోనే మరికొంత షూటింగ్ మహా కుంభమేళాలో కూడా జరిగే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని టాక్. గతంలో బాలయ్య రెమ్యూనరేషన్ 20 నుంచి 25 కోట్ల వరకు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య దాదాపు 70 నుంచి 80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలకు బాలయ్య స్పష్టంగా చెప్పినట్లు టాక్. ఈ సినిమా నార్త్ ఇండియాలో భారీగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండటంతో ప్రొడ్యూసర్లు కూడా బాలయ్యకు భారీ గానే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో బాలయ్య సినిమా అంటే తక్కువ బడ్జెట్ తో కంప్లీట్ అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ పెట్టుకొని సినిమాలు చేయాల్సిన పరిస్థితి. రీసెంట్ గా వచ్చిన డాకూ మహారాజ్ సినిమాకు కూడా బాలకృష్ణ దాదాపు 40 కోట్లకు పైగానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కూడా భారీగానే మార్కెట్ చేసింది. దీనితో నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చాయి. ఇక అఖండ సినిమా కూడా నార్త్ ఇండియాలో భారీగా మార్కెట్ చేసే విధంగానే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్లను ఈ సినిమాలో తీసుకుని కొన్ని సీన్స్ ను ప్లాన్ చేయాలని డైరెక్టర్ బోయపాటి రెడీ అయిపోయాడు. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోంది. జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలని బోయపాటి టార్గెట్ పెట్టుకున్నాడు.