బాలయ్య టార్గెట్ కూడా కన్నడే…? అఖండ సీక్వెల్ లో స్టార్ యాక్టర్ కు ఛాన్స్
అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ క్రేజ్ వేరే లెవల్ కు వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ గా బాలయ్య ఫేమస్ అయిపోయారు. ఆయన సినిమాలు అనగానే నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరుగుతుంది.
అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ క్రేజ్ వేరే లెవల్ కు వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ గా బాలయ్య ఫేమస్ అయిపోయారు. ఆయన సినిమాలు అనగానే నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరుగుతుంది. సోషల్ మీడియాలో ఏ అప్డేట్ వచ్చినా సరే నార్త్ ఇండియా కూడా షేక్ అవుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ అకెండా సీక్వెల్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలయ్య మంచి స్వింగ్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేసి దుమ్ము రేపాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు.
ఇక బోయపాటి కూడా షూటింగ్ విషయంలో ఎక్కడా డిలే లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా మహాకుంభమేళాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. త్వరలోనే కృష్ణా నదిలో షూటింగ్ ను షురూ చేయనున్నారు. కృష్ణాజిల్లాలోని గుడిమెట్లలో ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కర్ణాటకలో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయంలో బోయపాటి, బాలకృష్ణ ఇద్దరూ పక్క ప్లానింగ్ తో ఉన్నట్లు టాక్.
ముఖ్యంగా కర్ణాటక మార్కెట్ ను టార్గెట్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు డిమాండ్ పెరగడంతో.. అఖండ సీక్వెల్ ను కన్నడ లో కూడా రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా తెలుగుతోపాటుగా కన్నడలో చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ లేదంటే రిషబ్ శెట్టిని తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. వాళ్ళిద్దరికీ కన్నడ తో పాటుగా తమిళంలో కూడా క్రేజ్ ఉండటంతో ఈ డెసిషన్ తీసుకున్నారట మేకర్స్.
శివరాజ్ కుమార్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనబడుతున్నారు. తమిళ సినిమాల్లో కూడా ఆయనకు మంచిగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఆయన నటించే ఛాన్స్ ఉండడంతో కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రేజేన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కూడా కలిసి వస్తుంది. ఈ సినిమాలో బాలయ్య శివుడు భక్తుడుగా నటించడంతో.. సినిమా షూటింగ్ ను మహాకుంభమేళాలో జరిపారు. ఇక త్వరలోనే కేరళలోని ఒక బీచ్ లో కూడా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కూడా నటిస్తోంది. త్వరలోనే సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఇప్పటికే తన వర్క్ స్పీడ్ పెంచాడు.