Gabbar Singh: పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్‌.. గబ్బర్‌సింగ్ రీ రిలీజ్‌కు రెడీ..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి.. రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 9, 2023 | 07:14 PMLast Updated on: Aug 09, 2023 | 7:14 PM

Bandla Ganesh Confirms The Re Release Of Pawan Kalyans Gabbar Singh

Gabbar Singh: పవన్ కల్యాణ్‌ మాములుగా కనిపిస్తేనే.. ఫ్యాన్స్‌ జోష్ తట్టుకోవడం కష్టం. అలాంటిది బర్త్‌డే రోజు సెలబ్రేషన్స్ అంటే మాములుగా ఉంటుందా..? అలాంటి ట్రీట్‌నే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్. టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి.. రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఖుషీ, జల్సా, పోకిరి సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు.

బిజినెస్‌మెన్ రీ రిలీజ్‌తో థియేటర్ టాప్‌ లేచిపోయేలా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఈ సినిమా జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కోటి రూపాయలు కొల్లగొట్టింది. కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసే చాన్స్ ఉంది. ఐతే ఇప్పుడు అంతకుమించి అనేలా.. గబ్బర్‌సింగ్‌ మూవీని రీ రిలీజ్ చేస్తామని పవన్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ గుడ్ న్యూస్ చెప్పాడు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉంది. ఏ సినిమాను రీ రిలీజ్ చేస్తారని అడగ్గా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ రేంజ్ ఏంటో, పవర్ స్టార్ స్టామినా ఏంటో గబ్బర్ సింగ్ ద్వారా మరోసారి చూపిస్తాం అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయ్. పవన్‌ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు.. గబ్బర్‌సింగ్ ట్రాక్‌లో పడేసింది.

పవన్ హీరోయిజానికి, హరీష్‌శంకర్‌ డైలాగులకు.. థియేటర్లు దద్దరిల్లిపోయాయ్. ముఖ్యంగా కబడ్డీ, అంత్యాక్షరి ఎపిసోడ్‌ అయితే పీక్స్‌. బండ్ల చెప్పిన న్యూస్‌తో అప్పటి మెమొరీస్‌ మళ్లీ రివైజ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. గబ్బర్‌సింగ్‌ రిలీజ్ చేస్తే.. ఆ మూవీ విడుదలయిన ప్రతీ థియేటర్‌లో జాతర కనిపించడం ఖాయం. ఇక అటు బండ్ల ట్వీట్‌కు.. డైరెక్టర్ హరీష్ రిప్లయ్ ఇచ్చాడు. ఏం వార్త చెప్పారన్నా, అలాగే చేద్దామంటూ రాసుకొచ్చాడు.