CHIRANJEEVI: వైరల్ ట్వీట్.. బెంగుళూరులో నీటి సమస్యపై చిరు రియాక్షన్

తాజాగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ వైరల్‌గా మారింది. గత కొన్ని రోజుల నుంచి బెంగుళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఎంతో మంది ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట్లోనే నీటి కరువు ఉందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2024 | 05:35 PMLast Updated on: Mar 28, 2024 | 5:35 PM

Bengaluru Water Crisis Megastar Chiranjeevi Advocates For Permaculture Solutions To Tackle Water Problem

CHIRANJEEVI: నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్టాల్లోనే కాకుండా వేరే రాష్టాల్లో కూడా ఆయనకీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ విషయం ఆయన కొత్త సినిమా రిలీజైన ప్రతిసారి అర్ధం అవుతుంది. అలాగే చాలా మంది తాము ఎంచుకున్న రంగంలో సక్సెస్ సాధించడానికి కూడా మెగాస్టార్ ఇన్స్పిరేషన్‌గా నిలిచాడు. దీన్ని బట్టి ఆయన ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.

Samantha Ruth Prabhu: డివోర్స్ తర్వాత హద్దులు దాటేస్తున్న సమంత..

చిరు కూడా అందుకు తగ్గట్లే సమాజాన్ని చాలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ వైరల్‌గా మారింది. గత కొన్ని రోజుల నుంచి బెంగుళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఎంతో మంది ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట్లోనే నీటి కరువు ఉందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి ఈ సమస్యకి ఒక పరిష్కారమార్గాన్ని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తన ఫామ్‌హౌస్‌లో ఇదే పద్దతిని పాటించి, నీటి సమస్యని నివారించామని తెలిపాడు. వాటి తాలూకు ఫోటోలని కూడా షేర్ చేసాడు.

పైగా చిరు తన ట్వీట్‌ని కన్నడలోనే చేసాడు. ఇక చిరుకి ఎన్నో సంవత్సరాల నుంచే బెంగళూరులో ఫామ్‌హౌస్ ఉంది. గత సంవత్సరం సంక్రాంతి వేడుకల్ని తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే జరుపుకున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. గత చిత్రం భోళాశంకర్ ప్లాప్‌తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.