బెట్టింగ్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి.. ఎవర్నీ వదిలేటట్టు లేరుగా..!
గత వారం రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇందులో ఉన్నకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్లైనా ఎవరిని ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.

గత వారం రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇందులో ఉన్నకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్లైనా ఎవరిని ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. తాజాగా విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల మీద కూడా పోలీసులు కేసులు ఫైల్ చేశారు. వీళ్ళ కంటే ముందు కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్లపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. బెట్టింగ్ తో చాలా మంది ప్రజలు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో పోలీసులు దీనిపై ఫోకస్ చేసారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. అయినా విజయ్ ప్రచారం చేసిన కంపెనీలన్ని చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని, ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ బ్రాండింగ్ చేశాడని పీఆర్ టీమ్ తెలియజేసింది.
విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా.. ఏ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందనీ.. తాను ప్రచారం చేస్తున్న కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్ట ప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని విజయ్ టీం చెప్పింది. అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ పనిచేశాడని.. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసిందనీ వాళ్ల టీం చెప్పుకొచ్చింది. పైగా ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసిందనీ.. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదనీ వాళ్లు క్లారిటీ ఇచ్చారు. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కాదు నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళలతో పాటు.. బుల్లితెర నటులు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ప్రణీత, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్, నయిని పావని, నేహా పఠాన్ లాంటి వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇప్పటికే వీళ్లలో పలువురిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారిస్తున్నారు. చిన్నవాళ్ళు ఉంటే గాని పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ విషయం మీద పోలీస్ స్టేషన్ కు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా బెట్టింగ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నప్పుడు.. వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. మరి ఇలాంటి సమయంలో స్టార్స్ దీని నుంచి ఎలా బయటపడతారు అనేది చూడాలి.