Bhimaa Trailer: భీమా ట్రైలర్.. గోపీచంద్ ఊచకోత

యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్ వంటి అంశాలతో, విజువల్ వండర్‌గా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్‌లో గోపీచంద్ మాస్ అవతార్‌లో ఇరగదీశాడనే చెప్పాలి. కమర్షియల్ అంశాలతోపాటు పరశురాముడు, శివుడు అంటూ మైథలాజీ టచ్ ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 08:59 PMLast Updated on: Feb 24, 2024 | 9:00 PM

Bhimaa Trailer Released Gopichands Dual Mass Treat

Bhimaa Trailer: టాలీవుడ్‌లో చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్. వరుసగా సినిమాలు చేస్తున్నా.. అనుకున్న సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అయితే, తాజాగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం మాత్రం ఆయనకు బిగ్ సక్సెస్ ఇచ్చేలా ఉంది. గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. ఈ చిత్ర ట్రైలర్ శనివారం సాయంత్రం విడుదలైంది. యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్ వంటి అంశాలతో, విజువల్ వండర్‌గా ఉంది ట్రైలర్.

TDP-JANASENA: టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనతో నిరసనలు.. టిక్కెట్లు రాని నేతల ఆందోళన

ఈ ట్రైలర్‌లో గోపీచంద్ మాస్ అవతార్‌లో ఇరగదీశాడనే చెప్పాలి. కమర్షియల్ అంశాలతోపాటు పరశురాముడు, శివుడు అంటూ మైథలాజీ టచ్ ఇచ్చారు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మైథాలజీ, థ్రిల్లింగ్ వంటి అంశాలకు అద్భుతమైన యాక్షన్ జోడించి ఈ చిత్రం రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చాలా కాలం తర్వాత గోపీచంద్ నుంచి పర్ఫెక్ట్ సినిమా రాబోతుంది అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఈ సినిమాలో గోపీచంద్ ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. మరో లుక్ కూడా ట్రైలర్‌లో రివీల్ చేశారు. ఇందులో గోపీ.. డ్యుయల్ రోల్ చేస్తున్నాడా.. లేక రెండు విభిన్న షేడ్స్ ఉంటాయా అనేది చిత్రం విడుదలయ్యాకే తెలుస్తుంది. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్‌లో ఉన్నాయి.

కన్నడలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకుడు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న విడుదల కానుంది. మరి ఈ చిత్రం గోపీకి కంబ్యాక్ ఫిలిం అవుతుందో.. లేదో చూడాలి.