Bhola Shankar: జైలర్, భోళా శంకర్ కోసం ఏం చేసినా నో యూజ్.. ఎందుకు?
జైలర్, భోళా శంకర్ విషయంలో ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంత ఆసక్తిగా లేరా..? కారణాలేంటి..? జైలర్ స్ట్రెయిట్ సినిమానే. కానీ, రజినీ వరుస ఫ్లాపుల వల్ల ఈ సినిమాకు సరైన హైప్ లేదు. భోళా శంకర్ పాటలు, టీజర్ కూడా అంతగా ఎక్కలేదు.

Bhola Shankar: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీకి పెద్దగా హైప్ రావట్లేదు. ఒకప్పటిలా రజినీకి క్రేజ్ లేదని, డజన్ కిపైనే ప్లాపుల వల్ల తన చరిష్మా తగ్గిందనే కామెంట్లు పెరిగాయి. అందుకే ఎవరూ జైలర్‌ని పట్టించుకోవట్లేదంటున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మెగాస్టార్‌కి వచ్చిందా..?
భోళా శంకర్‌ని ఎవరూ పట్టించుకోవట్లేదా..? పాటలు గొప్పగా లేవు. టీజర్ పేలలేదు. చిరు లుక్ కిక్ ఇవ్వలేదు. ఇక జైలర్‌లో తమన్నా, ఇందులో తమన్నా. రెండింటిలోనూ కూడా మిల్కీ బ్యూటీ పెద్దగా స్పెషల్ ఎట్రాక్షన్ అనేలా లేదు. ఏదైమైనా మోహర్ రమేష్ మేకింగ్ మహత్యమో, తమన్నా బోర్ కొట్టడమో, లేదంటే భోళా శంకర్ పాటలో, జైలర్ మ్యూజిక్కో ఇలా ఏది వర్కవుట్ కావడం లేదంటున్నారు. ఆగస్ట్ 10న జైలర్, 11న భోళా శంకర్ సినిమాలు రాబోతున్నాయి. అంటే రిలీజ్‌కి ఇంకా రెండు వారాలు లేదు. అయినా ఎక్కడా ఈ సినిమాల మీద హైప్ కాని, బజ్ కానీ కనిపించట్లేదు.