BHOLA SHANKAR: రీ’మేకులు’.. 2023లో కలిసిరాని రీమేకులు..!
ఈ ఇయర్ సీనియర్ స్టార్స్ నుంచి యువ హీరోల వరకు అందరు రీమేక్‌లు చేశారు. కానీ అందులో చాలావరకు ప్రేక్షకుల్ని అలరించలేదు. ముఖ్యంగా ఓటీటీల్లో ఆల్ రెడీ చూసి ఉండటంతో.. వాటి దిక్కు కన్నెత్తి చూడలేదు.
BHOLA SHANKAR: 2023 రీమేక్ సినిమాలకు పెద్దగా కలిసిరాలేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు భారీ అంచనాలతో వచ్చి అభిమానులని అంతే భారీగా నిరాశపరిచాయి. ఈ ఇయర్ సీనియర్ స్టార్స్ నుంచి యువ హీరోల వరకు అందరు రీమేక్‌లు చేశారు. కానీ అందులో చాలావరకు ప్రేక్షకుల్ని అలరించలేదు. ముఖ్యంగా ఓటీటీల్లో ఆల్ రెడీ చూసి ఉండటంతో.. వాటి దిక్కు కన్నెత్తి చూడలేదు. దీంతో చాలా సినిమాలు పెట్టుబడిని కూడా రాబట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.
PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్..! తీర్పు వాయిదా..
2023లో రీమేక్ చేసిన సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చి నిరాశ పరిచిన సినిమా భోళా శంకర్. తమిళ సినిమా వేదాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కూడా మొదటి నుంచి డౌట్ పడుతూనే వచ్చారు. ముఖ్యంగా మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా చిరు రిస్క్ చేయడం చూసి చాలా మంది భయపడ్డారు. ఫైనల్‌గా సినిమా రిజల్ట్ కూడా అలానే వచ్చింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది రీమేక్‌గా వచ్చి నిరాశ పరిచిన మరో క్రేజీ మూవీ రవితేజ రావణాసుర. బెంగాళీ మూవీ విన్సీ దా రీమేక్‌గా వచ్చిన రావణాసుర సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోలేదు. కొన్నాళ్లుగా రీమేక్‌కు అలవాటుపడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ ఏడాది రీమేక్ సినిమాతోనే వచ్చాడు. తమిళ సినిమా వినోదయ సీతంని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు.
సాయి ధరం తేజ్‌తో కలిసి నటించిన ఈ సినిమాను ఒరిజినల్ దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు. బ్రో.. సినిమా కూడా పవన్ కళ్యాణ్ రేంజ్‌కి తగిన రిజల్ట్ దక్కించుకోలేదు. మరాఠి సినిమా నట సామ్రాట్ రీమేక్‌గా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన రంగమార్తాండ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది. రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చినా సరే ఈ సినిమాను ఆడియన్స్ పట్టించుకోలేదు. సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కోట బొమ్మాళి సినిమాలు ఒరిజినల్ సినిమాల తరహాలో విజయవంతం కాలేకపోయాయి. మొత్తంగా తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది ఒరిజినల్ కథలకే జై కొట్టారు.