Bhola Shankar: ఏపీ ప్రభుత్వానికి భోళా శంకర్ రిక్వెస్ట్.. టికెట్ రేట్లు పెంచుతారా.. లేదా..?
చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సమయంలో భోళా శంకర్ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ వచ్చింది. ఈ అంశంలో జగన్ తీసుకొనే నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య 2 వందల రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bhola Shankar: జగన్‌ను, ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ చిరంజీవి మాట్లాడిన మాటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయ్. పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లు సాగిన రాజకీయ యుద్ధం.. చిరంజీవి కామెంట్స్‌తో కొత్త టర్న్ తీసుకుంది. ఇదే సమయంలో చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సమయంలో భోళా శంకర్ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ వచ్చింది. ఈ అంశంలో జగన్ తీసుకొనే నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య 2 వందల రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక లాంటి సినీ పరిశ్రమపైన పడకుండా.. ప్రత్యేక హోదా, రోడ్లు బాగుచేయటం, పేదలకు సంక్షేమం వంటి వాటిపై ఆలోచన చేయాలని పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఏపీ మంత్రులు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కొడాలి నాని అయితే మరింత రెచ్చిపోయారు. ప్రతీ పకోడిగాడు సలహాలు ఇచ్చేవాడే అంటూ.. సెటైర్లు గుప్పించారు. కట్ చేస్తే ఇలాంటి సమయంలో.. సినిమా విడుదలకు ముందు భోళా శంకర్ మూవీ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి టికెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఐతే ఈ అభ్యర్థనపై ప్రభుత్వం వివరణ కోరింది. సినిమా నిర్మాణానికి సంబంధించి.. వివరాలు కోరినట్లుగా తెలుస్తోంది.
బడ్జెట్ ఆధారంగా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని గతంలో పాలసీ నిర్ణయంగా తీసుకున్నారు. టికెట్ ధరల పెంపుపైన గతంలో చిరంజీవి నాయకత్వంలో సినీ టీం నేరుగా సీఎం జగన్‌తో చర్చలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పట్లోనే చిరంజీవి స్వాగతించారు. ఇప్పుడు చిరంజీవి ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో.. భోళా శంకర్ టికెట్ ధరల పెంపు విషయంలో తీసుకొనే నిర్ణయంపై ఆసక్తి కొనసాగుతోంది.