ఇదెక్కడి ఊచకోత… 20 నిమిషాల పాటు ఊహించని ఊచకోత ..?
దేవర ఫస్ట్ పార్ట్ ఈ నెలాఖర్లో వస్తోంది. ట్రైలర్ లోడ్ అవుతోంది. ఇక ప్రోమో తో ప్రమోషన్ లో ఎమోషన్ ని పీక్స్ తీసుకెళ్లే టైంలో, సినిమా నిడివి, కొత్త అప్ డేట్లు షాక్ ఇస్తున్నాయి. ఒక వైపు యూఎస్ లో అడ్వాన్స్ బుక్కింగ్స్, మరోవైపు ప్రిరిలీజ్ బిజినెస్ తో దేవర విడుదలకుముందే ట్రెండ్ సెట్ చేసేలా ఉంది.
దేవర ఫస్ట్ పార్ట్ ఈ నెలాఖర్లో వస్తోంది. ట్రైలర్ లోడ్ అవుతోంది. ఇక ప్రోమో తో ప్రమోషన్ లో ఎమోషన్ ని పీక్స్ తీసుకెళ్లే టైంలో, సినిమా నిడివి, కొత్త అప్ డేట్లు షాక్ ఇస్తున్నాయి. ఒక వైపు యూఎస్ లో అడ్వాన్స్ బుక్కింగ్స్, మరోవైపు ప్రిరిలీజ్ బిజినెస్ తో దేవర విడుదలకుముందే ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. అలాంటి టైంలో సినిమాకు సంబంధించి లీకులు షాక్ ఇవ్వాల్సింది పోయి, సినిమా మీద హైప్ ని పెంచేస్తున్నాయి. దేవర ఊచకోత మీదే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఇంతకి దేవర ఊచకోత మ్యాటరేంటి ?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా మరో రెండు వారాల్లో వెండితెరమీద దండయాత్ర చేయబోతున్నాడు. మూడు పాటలు తూటాల్లాపేలితే, గ్లింప్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మిగిలింది ట్రైలర్ దాడే… అది కూడా లోడ్ అయ్యింది. మంగళవారం మైండ్ బ్లాంక్ కాబోతోంది. ఐతే ఈ సినిమా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ తాలూకు రెండు లీకులు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి…
ఆల్రెడీ రిలీజ్ కిముందే యూఎస్ లో 30 వేల టిక్కెట్లు బుక్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్ంగా 55 ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్స్ లో రోజుకి 7 షోల చొప్పున 400 షోలను భారీ ఎత్తున ప్లాన్చేస్తోంది దేవరటీం. ఐదు భాషల థియేట్రికల్ రైట్స్ నార్త్ ఇండియాలో 400 కోట్లు, యూఎస్ లో 65 కోట్లు, యూరప్, ఆస్ట్రేలియా రైట్స్ 35 కోట్లు ఇలా సౌత్ థియేట్రికల్ రైట్స్ తో సంబంధం లేకుండానే ఈపాటికే 500 కోట్ల బిజినెస్ జరిగింది. సౌత్ రైట్స్ కలుపుకుంటే మరో 300 కోట్లు , ఓటీటీ, శాటిలైట్ రైట్స్ చూస్తే మొత్తంగా ఈ సినిమా 1000 కోట్ల బిజినెస్ ని ముందే కన్ఫామ్ చేసింది.
దేవర మూవీ రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీసిందే అని ఆల్రెడి తేలిపోయిందీ. ఏపీలో దళితుల మీద జరిగిన దాడి ప్రేరణగా తెరకెక్కిందే దేవర అంటున్నారు. అయితే ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ ఎపిసోడ్ కీలకంగా మారింది. బాహుబలి 1, బాహుబలి 2 లో ఏరేంజ్ వార్ ఫైట్ ఉంటుందో, ఆస్థాయిలో ఊచకోతని దేవరలో తెరకెక్కించాడట కొరటాల శివ
దేవర మూవీలో లాస్ట్ 30 నిమిషాలే సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అని తెలుస్తోంది. లీకైన రెండు క్లిప్పులు ఫిల్మ్ టీమే ఇండైరెక్ట్ ప్రమోషన్ లో భాగంగా రివీల్ చేసిందా అన్న చర్చ జరుగుతోంది. ప్రమోషన్ పెంచకపోయినా, పాటలు, గ్లింప్స్ తో భారీగా దేవరకి హైప పెరుగుతోంది. ఆల్రెడీ ఓవర్ సీన్ లో దేవర ఫీవర్ మొదలైంది. అలాంటి టైంలో ఈ ఊచకోత క్లైమాక్స్ తో ఫ్యాన్స్ లో పూనకాలు మొదలౌతున్నాయి.