Amitabh Bachchan : మరణమే లేని చిరంజీవిగా బిగ్ బీ.. అశ్వత్థామ గా అమితాబ్

సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'కల్కి' (Kalki) సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2024 | 01:38 PMLast Updated on: Apr 22, 2024 | 1:38 PM

Big B As Immortal Immortal Amitabh As Ashwatthama

 

 

 

సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కల్కి’ (Kalki) సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని డార్లింగ్ ఫాన్స్ కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత వైజయంతి బ్యానర్ కు బాగా కలిసొచ్చిన మే 9 డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు.

అయితే సినిమా రిలీజ్ కు నాలుగు రోజుల ముందు ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ దెబ్బ కలెక్షన్స్ పై పడుతుందని మేకర్స్ మరోసారి పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టాలీవుడ్ (Tollywood) సహా అన్ని ఉడ్ లను ఊపేసింది. పక్కా రెండు వేల కోట్ల బొమ్మ అవుతుందని టాలీవుడ్ సినీ ప్రియులు ధీమాగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అమితాబ్ (Amitabh) బచ్చన్ గ్లింప్స్ రిలీజైంది.

కల్కీలో అమితాబ్ అశ్వథ్థామ (Ashwathama) గా నటించనున్నట్లు ఎప్పుడో లీకైన విషయమే అయినా.. ఇప్పుడు రిలీజైన గ్లింప్స్ తో క్లారిటీ వచ్చింది. కళ్లు మాత్రమే కనిపించే విధంగా ఒళ్లంతా గుడ్డ చుట్టుకుని ఉన్న అమితాబ్ ను ఓ పిల్లాడు.. ఎవరు నువ్వు, నీకు మరణం అన్నదే లేదా నువ్వు దేవుడివా ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను ద్వాపర యుగం నుంచి ఉన్నాను. గురు ద్రోణాచార్యుడి పుత్రుడను అశ్వత్థామను నేను అంటూ అమితాబ్ పిల్లాడికి సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సినిమాకు సంబంధించిన డీటైల్స్ పెద్దగా రివీల్ చేయలేదు కానీ.. అమితాబ్ పాత్ర కల్కీలో కీలకంగా కాబోతుందని క్లారిటీ వచ్చేసింది. గ్లింప్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ఇలా స్టార్ కాస్ట్ అంతా ఈ సినిమాలో ఉండటంతో ఆడియెన్స్ లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ స్టార్ లు సైతం క్యామియోలు చేస్తున్నట్లు న్యూస్ రావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.