Munawar Faruqui: బిగ్‌బాస్ విజేత అరెస్టు.. హుక్కా తాగుతూ దొరికిన మునావర్
హిందీ బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారూఖీని పోలీసులు అరెస్టు చేశారు. స్టాండప్ కమెడియన్ అయిన మునావర్ ఫారూఖీ.. ఇటీవల హిందీ బిగ్‌బాస్ సీజన్ 17లో పాల్గొని, విజేతగా నిలిచాడు. ముందునుంచి వివాదాస్పదుడిగా అతడికి పేరుంది.
Munawar Faruqui: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటున్నారు. గతేడాది తెలుగు బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను న్యూసెన్స్ కేసులో పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవల చిన్నారి దత్తత విషయంలో, రూల్స్ పాటించని కారణంగా కన్నడ బిగ్‌బాస్ ఫేం సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్‌బాస్ హిందీ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్ కూడా ఇటీవల రేవ్ పార్టీ విషయంలో అరెస్టయ్యాడు.
Anasuya Bharadwaj: పవన్‌కి సపోర్ట్.. పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా.. యాంకర్ అనసూయ
ఇలా ఇతర భాషల్లోని పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా హిందీ బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారూఖీని పోలీసులు అరెస్టు చేశారు. స్టాండప్ కమెడియన్ అయిన మునావర్ ఫారూఖీ.. ఇటీవల హిందీ బిగ్‌బాస్ సీజన్ 17లో పాల్గొని, విజేతగా నిలిచాడు. ముందునుంచి వివాదాస్పదుడిగా అతడికి పేరుంది. తాజాగా హుక్కా తాగుతూ పోలీసులకు దొరికాడు. ముంబై నగరంలోని బూరా బజార్‌లో ఉన్న హుక్కా సెంటర్‌పై పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ సమయంలో నిషేధిత హుక్కా తాగుతూ కనిపించాడు మునావర్. దీంతో అతడితోపాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అక్కడ ఆయుర్వేదిక్ హుక్కా పేరుతో, అసలైన హుక్కాను వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో హుక్కా తాగుతూ దొరికిన మునావర్ ఫారూఖీతోపాటు మిగతా నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ తర్వాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, మునావర్ ఫారూఖీ అరెస్టు కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.