Big Boss Big Twist  : బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. అందరూ సేఫ్.. ఎవిక్షన్ ఎఫెక్ట్..

బిగ్ బాస్ సీజన్ 7 నిజంగా ఉల్టా పుల్టాగా మారిపోయింది. ఇప్పటి వరకు ఏ సీజన్ లో ఈ సీజన్‌లోలా ట్విస్ట్‌లు జరగలేదు. దీంతో రోజు రోజుకు ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. ఎప్పటిలాగానే సండే ఫన్‌డే అంటూ ప్రేక్షకులను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఎంటర్‌టైన్ చేయించడానికి వచ్చేశాడు నాగార్జున. ఆట కావాలా, పాట కావాలా అంటూ స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చిన నాగ్.. వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్‌తో సరదా కబుర్లు మొదలుపెట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 11:10 AMLast Updated on: Nov 20, 2023 | 11:10 AM

Big Boss Big Twist Everyone Safe Eviction Effect

బిగ్ బాస్ సీజన్ 7 నిజంగా ఉల్టా పుల్టాగా మారిపోయింది. ఇప్పటి వరకు ఏ సీజన్ లో ఈ సీజన్‌లోలా ట్విస్ట్‌లు జరగలేదు. దీంతో రోజు రోజుకు ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. ఎప్పటిలాగానే సండే ఫన్‌డే అంటూ ప్రేక్షకులను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఎంటర్‌టైన్ చేయించడానికి వచ్చేశాడు నాగార్జున. ఆట కావాలా, పాట కావాలా అంటూ స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చిన నాగ్.. వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్‌తో సరదా కబుర్లు మొదలుపెట్టాడు. శనివారం కంటెస్టెంట్స్ చేసిన తప్పులను గుర్తుచేసి.. వారి ఆటను మెరుగుపరచుకోవడం కోసం సలహాలు ఇచ్చిన నాగార్జున.. ఆదివారం ఎపిసోడ్‌లో మాత్రం అందరితో సరదాగా గడిపాడు.

స్టేజీ పైకి వచ్చిన నాగార్జున.. ఇంట్లో జరుగుతున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి చర్చించుకున్న మాటలను విన్నాడు. యావర్ ఎవిక్షన్ పాస్ ను తిరిగి ఇచ్చేయడంతో ప్రియాంక, శోభాశెట్టి.. మెచ్చుకోగా… రతిక సేఫ్ గేమ్ అంటూ చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడిన నాగార్జున శోభాపై సెటైర్ వేశాడు. మైక్ వేసుకోవాలమ్మా. మేకప్ వేసుకున్నావు. మైక్ మరచిపోయావ్ అంటూ ఆటపట్టించాడు. తర్వాత యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌజ్‌మేట్ గేమ్ ఆడించాడు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా ఒకరు తర్వాత ఒకరు వచ్చి వారు అనుకున్న వారికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ వేయగా.. ఇక బ్లాక్ అనుకున్న కంటెస్టెంట్స్ మొహంపై స్టాంప్ వేశారు. ఇక తర్వాత ఇంటి సభ్యులను సేవ్ చేశాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ‘కోటబొమ్మాలి PS’ మూవీ టీం సందడి చేసింది. మూవీ టీమ్ నుంచి సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చి ఇంటిసభ్యులతో సరదా మాట్లాడారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా స్టేజీ పైకి వచ్చిన శ్రీకాంత్.. శివాజీని తెగ ఆడేసుకున్నాడు. తర్వాత ఇంటిసభ్యుల ఆట తీరుపై రివ్యూ ఇచ్చాడు శ్రీకాంత్. అందరు బాగా ఆడుతున్నారని.. అలాగే ఆడాలని సూచించాడు. ఆతర్వాత మరికొంత మందిని సేవ్ చేశాడు బిగ్ బాస్. తర్వాత మీమ్ ఆఫ్ ది వీక్ వీడియోను చూపించాడు నాగార్జున.

ఎపిసోడ్ సరదాగా సాగుతుండగా.. చివరగా ఎలిమినేషన్ లో గౌతమ్, అశ్విని ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఇంటిసభ్యులు టెన్షన్ పడ్డారు. గార్డెన్ ఏరియాలో రెండు బాక్సులు ఉంచి.. అందులో చేతులు పెట్టాలని నాగార్జున సూచించాడు. ఎవరి చేయి రెడ్ కలర్ ఉంటుందో వారు ఎలిమినేట్ అవుతారని.. వారి కోసం స్టేజ్ పై వెయిట్ చేస్తానని నాగార్జున చెప్పాడు. తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి.. చేతులు పైకి తీయాలని సూచించాడు. అయితే ఇద్దరి చేతులకు గ్రీన్ కలర్ ఉండటంతో షాక్ అవుతారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేదని కూల్ గా చెప్పాడు నాగార్జున. ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసినందుకు ఈ వారం ఎలిమినేషన్ లేదని.. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టెన్షన్ పెట్టి వెళ్లిపోయారు నాగార్జున.