నాగార్జునను ప్రైవసీ అడిగిన కమెడియన్ సత్య

బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ మన తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8 వ సీజన్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2024 | 12:48 PMLast Updated on: Aug 21, 2024 | 12:48 PM

Big Boss Season 8 Song Release

బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ మన తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8 వ సీజన్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. బిగ్ బాస్ ని ఈసారి గ్రాండ్ గా ప్లాన్ చేసేందుకు రెడీ అవుతోంది స్టార్ మా. పార్టిసిపేట్ చేసే వాళ్ళ విషయంలో కూడా ఈసారి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ ని సెలెక్ట్ చేస్తే మంచిది అనే ఆలోచనలో ఉంది. గత సీజన్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు అనే సంగతి తెల్సిందే.

ఇప్పుడు మాత్రం గట్టిగా ప్లాన్ చేసి కొడుతోంది. ఇందులో సామాన్యులతో పాటుగా సినీ స్టార్స్ ని కూడా దించుతుంది. దాదాపుగా కంటెస్టెంట్ లు అందరూ ఖరారు అయిపోయారు. ఇక వేణు స్వామి లాంటి వాళ్ళను కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు బిగ్ బాస్ సాంగ్ ని రిలీజ్ చేసింది స్టార్ మా. ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ లిమిట్ ఏ లేదు అంటూ అక్కినేని నాగార్జున ఈ సాంగ్ ను లాంచ్ చేసారు. అందులో అమ్మాయిలతో ఆయన స్టెప్స్ వేసారు.

ఇక కమెడియన్ సత్య కూడా ఈ సాంగ్ లో అలరించాడు. సత్య తన మార్క్ కామెడితో నవ్వులు పూయించాడు. సాంగ్ ఎండింగ్ లో ఇక ఫన్ కి, కామెడికి, వినోదానికి అసలు లిమిట్ లేదు అంటూ నాగార్జున చెప్పడంతో ఏ రేంజ్ లో ఉంటుందా అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో కుమారి ఆంటీ, ఫార్మర్ నేత్ర కూడా ఉండే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. తెలుగు ప్రేక్షకులను టీవీ స్క్రీన్ కి కట్టి పడేసే విధంగా బిగ్ బాస్ ని ప్లాన్ చేసినట్టుగా అర్ధమవుతోంది. మరి అంచనాలను ఏ విధంగా అందుకుంటారో చూడాలి.