బిగ్ బ్రేకింగ్: జానీ మాస్టర్ బాధితురాలికి అండగా బన్నీ, గీతా ఆర్ట్స్ లో జాబ్

జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెకు సినిమా పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను వెలివేయాలనే డిమాండ్ లు కూడా వినపడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2024 | 02:28 PMLast Updated on: Sep 17, 2024 | 2:28 PM

Big Breaking Bunny As Johnny Masters Victim Geetha Is A Job At Arts

జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెకు సినిమా పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను వెలివేయాలనే డిమాండ్ లు కూడా వినపడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎక్స్ లో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. అటు తమిళంలో కూడా ఈ వ్యవహారం సంచలనం అయింది. అక్కడ కూడా జానీ మాస్టర్ పలువురు హీరోలతో కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ఎంటర్ అయ్యారు. జానీ మాస్టర్ వేధించిన జూనియర్ డాన్సర్ కు అండగా నిలబడ్డాడు. తన మేనేజర్ ద్వారా ఫోన్ చేయించి ఆమెతో మాట్లాడారు. తమ ఆధ్వర్యంలో నడిచే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఆమెకు ఉద్యోగంతో పాటుగా తాను నటించబోయే అన్ని సినిమాల్లో ఆమెకు అవకాశం కల్పిస్తాను అని హామీ ఇచ్చాడు. అలాగే ఈ కేసులో తాను పోరాటం చేయడానికి ఆర్ధిక సహాయం కూడా చేస్తా అని బన్నీ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ విషయాన్ని నటి, యాంకర్ ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

అల్లు అర్జున్ పేరు బయటకు తీయకుండా ఒక పెద్ద హీరో… ఆమెకు అండగా నిలబడ్డాడు అని చెప్పారు. ఆ తర్వాత మీడియా వర్గాలు ఆరా తీయగా ఆ హీరో బన్నీ అని తెలిసింది. తన ఇంటికి కూడా ఆమెను బన్నీ ఆహ్వానించాడు. దీని వెనుక కారణాలు ఏంటీ అనేది తెలియకపోయినా… మెగా హీరోలు అందరితో జానీ మాస్టర్ సన్నిహితంగా ఉంటాడు. మెగా ఫ్యామిలీకి బన్నీ కి మధ్య గ్యాప్ ఉంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంలో బన్నీ ఎంటర్ కావడం వెనుక మెగా ఫ్యామిలీ మీద ఉన్న కోపమే అని… అందుకే ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇలాంటి పరిస్థితిలో ఆమెకు అల్లు అర్జున్ అండగా నిలబడటం అనేది సంచలనమే.