1000 కోట్లు.. 2000 కోట్లు.. 5000 కోట్ల నిర్ణయాల్లో పెను మార్పులు..

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే కనీసం వెయ్యికోట్లు రాబట్టాలి.. అదీ, పాన్ ఇండియా లెవల్లో తనుకున్న క్రేజ్. అలాంటిది సడన్ గా తన వెయ్యికోట్ల ప్రాజెక్టే కాదు, 2000 కోట్ల సినిమా లెక్కలు కూడా మారాయి.. 5000 కోట్ల ప్రాజెక్ట్ అయితే సంక్రాంతి, మార్చ్ ఇలా రెండు ముహుర్థాలను కూడా కాదని, హోల్డ్ లో పడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2024 | 08:08 PMLast Updated on: Dec 23, 2024 | 8:08 PM

Big Changes In Prabhas Up Comming Movies

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే కనీసం వెయ్యికోట్లు రాబట్టాలి.. అదీ, పాన్ ఇండియా లెవల్లో తనుకున్న క్రేజ్. అలాంటిది సడన్ గా తన వెయ్యికోట్ల ప్రాజెక్టే కాదు, 2000 కోట్ల సినిమా లెక్కలు కూడా మారాయి.. 5000 కోట్ల ప్రాజెక్ట్ అయితే సంక్రాంతి, మార్చ్ ఇలా రెండు ముహుర్థాలను కూడా కాదని, హోల్డ్ లో పడిపోయింది. ఈ మొత్తం సీన్ కి కారనం ఫౌజీ సెట్లో ప్రభాస్ కి అయినా గాయమే. తన యాంకిల్ గాయం వల్ల, చాలా వరకు ప్రాజెక్టుల ప్లానింగ్ మొత్తం మారిపోయింది. రెబల్ స్టారే క్లియర్ కట్ గా నిర్ణయం తీసుకున్నాడట. ఫలితంగా 2026 సంక్రాంతి, దసరా పండగలని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తోందట. వచ్చే దసరా పండగ కూడా రెబల్ స్టార్ వల్ల వాయిదా పడుతోందట. అంటే రెబల్ స్టార్ నిర్ణయంతో ఏకంగా పండగలనే పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తోందా…? అదెలా కుదురుతుంది?

రెబల్ స్టార్ కి ఫౌైజీ సెట్లో అయిన యాంకిల్ గాయం తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ మాత్రమే వాయిదా అనుకుంటే, అదే కాదు దాని రిలీజ్ డేట్ మారిపోతోంది. తర్వాత ఫౌజీ షెడ్యూల్స్ కూడా మారిపోతున్నాయి. ఆఖరికి వచ్చే ఏడాది, ఆపై వచ్చే ఏడాది పండగలే పోస్ట్ పోన్ అయ్యేంతగా రెబల్ స్టార్ నిర్ణయాలు, మార్కెట్ ని శాసించబోతున్నాయి

ది రాజా సాబ్ రిలీజ్ కిముందే వెయ్యికోట్ల వసూళ్లని ముందే కన్ఫామ్ చేసుకున్న మూవీ. నిజానికి ఏప్రిల్ 10 న రిలీజ్ అన్నారు. కాని మే లేదంటే జూన్ కి సినిమా వాయిదా వేసేలాఉన్నారు. కారణం ఇంకా 15 శాతం షూటింగ్ పెండింగ్ లోఉంది. గాయం నుంచి కోలుకున్నాక సంక్రాంతి పండగ తర్వాతే సెట్లో అడుగుపెడతాడట ప్రభాస్. కాబట్టి, షూటింగ్ వాయిదాతో, రిలీజ్ డేట్ కూడ వాయిదా అనివార్యమౌతోంది.

ఇక సంక్రాంతికి రెబల్ స్టార్ తో స్పిరిట్ మూవీని లాంచ్ చేయాలనుకున్న సందీప్ రెడ్డి వంగ, ఆ ఆలోచననే వాయిదా వేశాడట. దిరాజా సాబ్ పూర్తయ్యాక, ఫౌజీ కూడా సగానికి పైగా పూర్తయ్యాకే స్పిరిట్ని లాంచ్ చేయటం కాదు, రెగ్యులర్ షూట్ ని కూడా ఒకేసారి జూన్ లో లేదంటే ఆగస్ట్ లో మొదలు పెట్టాలనుకుంటున్నాడట.

ఇది కూడా ఓరకంగా ప్రభాస్ నిర్ణయం వల్లే జరిగిందని తెలుస్తోంది. ది రాజా సాబ్, ఫౌజీకి పూర్తి భిన్నమైన లుక్ లో స్పిరిట్ లో ప్రభాస్ కనిపించాలి కాబట్టి, అందుకు కొంత టైం పడుతుంది. కాబట్టి ఫౌజీ తాలూకు మేజర్ షూటింగ్ కూడా పూర్తయ్యాకే స్పిరిట్ షూటింగ్ మొదలయ్యేఛాన్స్ఉంది. ఫలితంగా 2025, 2026 పండగలే పోస్ట్ పోన్ అయ్యేలా ఉన్నాయి

ది రాజాసాబ్ ని నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ అన్నారు. కాని మేకి వాయిదా వేసేఛాన్స్ ఉంది ఇక దసరాకే ఫౌజీ వచ్చేలా టాకీ పార్ట్ ని జూన్ లోగా పూర్తిచేస్తారనే టాక్ నడిచింది. కాని ఇప్పుడు ప్రభాస్ యాంకిల్ గాయం వల్ల ప్లానింగ్ మొత్తం మారింది. ఈ దసరాకు ఫౌజీ రిలీజ్ ఆల్ మోస్ట్ ఇంపాజిబుల్. ఇక 2026 సంక్రాంతికి లేదా ఉగాదికి స్పిరిట్ వచ్చేలా సందీప్ రెడ్డి ముందుగా ప్లాన్ చేశాడు. ఇప్పుడు 2026 దసరాకు కూడా స్పిరిట్ రిలీజ్ అవటం సాధ్యం కాదని తేలింది. ఇక కల్కీ 2027 సంక్రాంతికి ప్లాన్ చేయాలన్నా, ముందు ప్రభాస్ కమిటైన సినిమాల షెడ్యూల్స్ మారకూడాదు.. కాని మారాయి… కాబట్టి దసరా, సంక్రాంతి లాంటి సీజన్స్ ని టార్గెట్ చేసుకున్న రెబల్ స్టార్, ఆ పండగ ముహుర్తాలను వదులుకుంటున్నాడు. అలా ఫ్యాన్స్ కి అసలైన పండగ సెలబ్రేషన్స్ పోస్ట్ పోన్ అయినట్టే అని తేలింది.