బెజవాడకు బండ్ల భారీ సాయం…? సినిమా లాభాల్లో 30 శాతం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కొత్త రికార్డ్ సెట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 01:21 PMLast Updated on: Sep 04, 2024 | 1:21 PM

Big Help Of Carts To Bejwada 30 Percent Of The Films Profits

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కొత్త రికార్డ్ సెట్ చేసింది. ఏ రీ రిలీజ్ కూడా ఈ రేంజ్ లో సక్సెస్ కాలేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉండటంతో సినిమాకు ఆ రేంజ్ లో హైప్ వచ్చింది. రీ రిలీజ్ కు కూడా ఆ రేంజ్ లో వసూళ్లు రావడంతో నిర్మాత బండ్ల గణేష్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

అందుకే ఇప్పుడు ఆయన భారీ సాయం చేసేందుకు సిద్దమవుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా వసూళ్ళలో 30 శాతం విజయవాడ వరద బాధితులకు ఇవ్వనున్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసి బండ్ల గణేష్ ఈ సాయం అందిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సాయం అందించడానికి విజయవాడ వస్తారు బండ్ల గణేష్. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయవాడ వరద బాధితుల కోసం భారీ సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చెరో కోటి రూపాయలను రెండు రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చారు.

అటు మహేష్ బాబు కూడా భారీ సహాయం చేసారు. ఇక త్రివిక్రమ్, అశ్వనీ దత్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చిన్న హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు. త్వరలోనే మరికొంత మంది హీరోలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక మెగా హీరోలు అందరూ కలిసి భారీ సాయం చేయడానికి కూడా సిద్దమవుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే పారిశ్రామిక వేత్తలు సైతం రాష్ట్రం కోసం ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.