కల్కీ ఫార్ములా ఫాలో అవుతున్న పుష్ప, ప్రమోషన్స్ కోసం బిగ్ స్కెచ్
ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వెయిటింగ్ మూవీ పుష్ప 2. మూడేళ్ళ నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. సినిమా మాత్రం ఆలస్యం అవుతూనే వచ్చింది. చివరకు డిసెంబర్ 5 న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వెయిటింగ్ మూవీ పుష్ప 2. మూడేళ్ళ నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. సినిమా మాత్రం ఆలస్యం అవుతూనే వచ్చింది. చివరకు డిసెంబర్ 5 న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇంకా సినిమాలో ఐటెం సాంగ్ ను షూట్ చేయాల్సి ఉంది. ముందు శ్రద్దా కపూర్ అనుకున్నా ఇప్పుడు మాత్రం యంగ్ హీరోయిన్ శ్రీలీల పేరు బాగా వినపడుతోంది. సమంతా పేరు వినపడినా సమంతా నో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ఫస్ట్ పార్ట్ లో ఐటెం సాంగ్ బాగా క్లిక్ అయిన సంగతి తెలిసిందే. అందుకే రెండో పార్ట్ కోసం కూడా ఓ మంచి ఐటెం సాంగ్ ను రెడీ చేసి పెట్టారు. చంద్రబోస్ ఇప్పటికే పాట కూడా రాసి రెడీ అయ్యారు. పాట పాడటం కూడా అయిపోయింది. షూట్ మాత్రమే వాయిదా పడింది. ఇక ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇండియా మొత్తం పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో అవకాశం వదులుకోవద్దని, నార్త్ లో ప్రమోషన్స్ భారీగా చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.
నార్త్ ప్రమోషన్స్ కోసం అక్కడి స్టార్ హీరోలను కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటి నుంచి వారానికి ఒకటి లేదా రెండు ఈవెంట్స్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ స్కెచ్ వేసారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలను ఇన్వైట్ చేయాలనీ చూస్తున్నట్టు టాక్. ‘పుష్ప 2’ ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌ను బీహార్ పాట్నాలో ప్లాన్ చేసినట్టు టాక్. నార్త్ లోనే భారీగా ఈవెంట్స్ చేయాలని చూస్తున్నారు. విడుదలకు సరిగా నెల రోజులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల రోజుల్లో నార్త్ లో ముంబై, ఢిల్లీతో పాటుగా బిహార్ యుపి, పంజాబ్ రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌లో సైతం అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేసారు.
గతంలో ప్రభాస్ సినిమాలకు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. బాహుబలి 2, కల్కీ సినిమాలకు బాగా ప్రమోషన్స్ చేసారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు కూడా బాగా ప్రమోషన్స్ చేసారు. కల్కి 2898 ఎడీ చిత్రం కోసం అయితే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసారు. సినిమాలో బాగా పాపులర్ అయిన బుజ్జి వెహికల్‌ను దాదాపు అన్నీ మెయిన్ సిటీస్ లో తిప్పి ప్రమోట్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ కావడంతో ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.