Bigg boss : ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌ బాస్ .. నిన్న అశ్విని ఔట్.. ఇవాళ ఎవరు..?

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ -7 ముగింపు దశకు వస్తున్న కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతోంది.. కంటెస్టెంట్‌ల ఎలిమినేషన్‌ ప్రక్రియ క్యూరియాసిటినీ రెకెత్తిస్తోంది.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ముందుగా హింట్లు వచ్చినట్లుగానే.. నిన్న శనివారం ఎపిసోడ్‌లోనే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 12:41 PMLast Updated on: Nov 26, 2023 | 12:41 PM

Bigg Boss Gave A Twist Yesterday Ashwini Was Out Who Is Today

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ -7 ముగింపు దశకు వస్తున్న కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతోంది.. కంటెస్టెంట్‌ల ఎలిమినేషన్‌ ప్రక్రియ క్యూరియాసిటినీ రెకెత్తిస్తోంది.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ముందుగా హింట్లు వచ్చినట్లుగానే.. నిన్న శనివారం ఎపిసోడ్‌లోనే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు..

ఎప్పటిలాగే శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల గేమ్ తీరుపై కింగ్ నాగార్జున రివ్యూ ఇచ్చారు.. అమర్ విషయంలో శివాజీ మాట తప్పడంపై అడిగారు.. కానీ, దాన్ని శివాజీ సమర్ధించుకునే సమాధానాలు చెప్పారు.. ఈ రివ్యూ తర్వాత డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు.. దీంతో శనివారం ఎపిసోడ్‍లో అశ్వినీ .. బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ మేరకు లీకులు వచ్చాయి. అలాగే ప్రోమోలో కూడా నాగార్జున అశ్వినీ శ్రీని ఓవర్ కాన్పిడెన్స్‌తో సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నావా అనడంతో 12వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ అశ్వినీ అని షో చూస్తున్న ఆడియన్స్‌కి తేలిపోయింది.

Telangana Rain : తెలంగాణకు వర్ష చూచన.. 4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

ఇక.. అశ్వినీ కూడా ఎలిమినేట్ అయిపోవడంతో..బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఐదుగురులో హౌస్‍లో అర్జున్ మాత్రమే మిగులుతారు. సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడమే అశ్వినీ కొంప ముంచిందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.. హోస్ట్ నాగార్జున కూడా అదే విషయాన్ని చెప్పారు..ఇక.. ఆదివారం ఎపిసోడ్‌లో రతిక కూడా ఎలిమినేషన్ అవుతుందని తెలుస్తోంది.. దీంతో.. ఇవాళ జరగబోయే ఎపిసోడ్‌పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది..

ఇక మరోవైపు ఈ సీజన్‌లో టాప్ ఫైవ్‌లో ఎవరు ఉండనున్నారు.. అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ జోరుగా నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ , బజ్ ప్రకారం ఈ సీజన్‌లో టాప్ ఫైవ్‌లో శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, ప్రియాంక ఉండబోతున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో..