Bigg Boss : బిగ్ బాస్ హౌస్.. నమ్మించి దెబ్బ కొట్టిన కంటెస్టెంట్లు.. రైతు బిడ్డ కన్నీళ్లు..

రైతు బిడ్డ కారణంగా అమర్ కెప్టెన్ కాలేకపోయాడని చెత్త రీజన్ చెప్పింది శోభా శెట్టి. ఆ తర్వాత గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానంటూ యావర్ కు నామినేషన్ వేసింది. దీంతో నేను రాయడం నువ్వు చూశావా అంటూ యావర్ అడగడంతో లేదు అంటూ తెల్ల ముఖం వేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2023 | 10:32 AMLast Updated on: Nov 28, 2023 | 10:32 AM

Bigg Boss House Contestants Who Believed And Hit Tears Of A Farmers Child

క్లైమాక్స్‌కు వచ్చేసిన బిగ్ బాస్ సీజన్ 7.. ట్విస్టుల మీద ట్విస్టులతో టీఆర్పీ రేటింగులను పెంచుకుంటూ దూసుకుపోతోంది.. గతవారం ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్‌ షాకిస్తే.. ఈ వారం నామినేషన్స్‌లో అర్జున్ అనుకోని షాకిచ్చాడు.. దీంతో.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పాయింట్ టూ పాయింట్ రసవత్తరంగా సాగింది.. ముఖ్యంగా SPY బ్యాచ్ మొత్తాన్ని SPA బ్యాచ్ టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. అలాగే కెప్టెన్సీ కోసం తనకు సపోర్ట్ గా నిలబడ్డ శివాజీకి షాకిచ్చాడు అర్జున్ అంబటి. తన కోసం అమర్ , ఇంటి సభ్యులతో పోరాడిన శివాజీని నామినేట్ చేసి పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్నాడని ఆడియెన్స్ అంటున్నారు.

ఇక.. ఈ వారం నామినేషన్లలో ఇంటి సభ్యులకే కాదు.. ప్రేక్షకులకు సైతం షాకిచ్చాడు అమర్. ఎందుకంటే గత రెండు వారాలుగా తన కోసం నిలబడిన ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. నువ్వు స్టోర్ రూమ్ కి వెళ్లి డెడ్ అయిపోవడం నాకు నచ్చలేదు.. నీతో గేమ్ ఆడడం మిస్ అయ్యాను అంటూ సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. అయితే అమర్ నామినేట్ చేయడం అస్సలు ఊహించని రైతు బిడ్డ ఎమోషనల్ అయ్యాడు. నీకు సపోర్ట్ చేసినందుకు నాకే నామినేట్ చేస్తావని అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు నామినేట్ చేస్తున్నందుకు కాదు.. నిన్ను నమ్మినందుకు ఇప్పుడు బాధపడుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ఇక తన రెండో నామినేషన్ గౌతమ్ కు వేశాడు అమర్.

Rashmika, Vijay : రష్మికతో విజయ్ దేవరకొండ..! సంక్రాంతి నుంచి ఫ్యామిలీ స్టార్ ఔట్..

రైతు బిడ్డ కారణంగా అమర్ కెప్టెన్ కాలేకపోయాడని చెత్త రీజన్ చెప్పింది శోభా శెట్టి. ఆ తర్వాత గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానంటూ యావర్ కు నామినేషన్ వేసింది. దీంతో నేను రాయడం నువ్వు చూశావా అంటూ యావర్ అడగడంతో లేదు అంటూ తెల్ల ముఖం వేసింది.

ప్రియాంక వచ్చి ప్రశాంత్ ను నామినేట్ చేసింది. తర్వాత శివాజీని పిలిచి నామినేట్ చేయగా.. శివాజీ సీరియస్ అయ్యాడు. నువ్ కోపంతోనే మాట్లాడుతావని అన్నాడు. నీకు నచ్చకుంటే నెగెటివ్‍గా చేస్తావని తెలిపాడు. నేను చెప్పిన అబద్ధాలు ఏంటి అని ప్రశ్నించింది ప్రియాంక. అవును శనివారం రాగానే స్వీట్‍గా మాట్లాడుతావని, హౌసులో ఉన్నవాళ్లతో ఎందుకు మాట్లాడవని అడిగాడు. అదేంలేదని చెప్పింది ప్రియాంక..

MEGASTAR CHIRANJEEVI: చిరుతో మంచు విష్ణు.. క్రెడిట్ అంతా కన్నప్పదే..

ఇక శోభా మాత్రం అర్థం లేని నామినేషన్స్ వేసి ఇంకా నెగిటివిని సొంతం చేసుకుంది. ముందుగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. నువ్వు అసలైన సేఫ్ట ప్లేయర్.. నీ వల్లే అమర్ కెప్టెన్సీ పోయింది అంటూ రీజన్ చెప్పింది. నేను నీకు చెప్పా మనం ఇద్దరం చివరకు వెళ్దామని.. అలా చేసి ఉంటే అమర్ కెప్టెన్ అయ్యి ఉండేవాడని అని చేప్పేసింది. ఇందుకు ప్రశాంత్ ఒప్పుకోలేదు. కానీ నా పాయింట్లు చెప్పేశాను అంటూ రంగు పూయడానికి వెళ్లింది. కానీ ప్రశాంత్ ఒప్పుకోలేదు. నువ్వు దోస్తాన్ గేమ్ ఆడుతున్నావ్ అని అన్నాడు. ఇక తర్వాత యావర్ కు వేసింది శోభా.

శివాజీ మరో నామినేషన్ గౌతమ్‍కు వేశాడు. నన్ను కావాలని టార్గెట్ చేస్తూ నామినేషన్ వేస్తున్నావని అన్నాడు. నాకు అడ్డుకట్ట వేసేందుకు ట్రై చేస్తున్నావని గౌతమ్ చెప్పాడు. అసలు ఏంటన్న మీ SPY బ్యాచ్ అని అడిగాడు. వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నావని మాట్లాడాడు. యావర్ వచ్చి గౌతమ్‍ను నామినేట్ చేశాడు. మళ్లీ పాత విషయాలను ఎందుకు తీస్తున్నావని, నీ డాక్టర్ సర్టిఫికేట్ మీద నేను మాట్లాడిన సందర్భం వేరు అని తెలిపాడు.. మరో నామినేషన్ గౌతమ్‍కు వేశాడు అమర్.. మెుత్తానికి ఈసారి బిగ్ బాస్ హౌసులో అమర్‍దీప్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.మొత్తానికి ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కంటెస్టెంట్లకే కాదు.. ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్‌ ఇచ్చింది.