Bigg Boss season 7 : బిగ్ బాస్ సీజన్ 7 ఆఖరి ఘట్టం.. అమర్, ప్రశాంత్ మధ్య మళ్లీ మాటల యుద్ధం..
బిగ్ బాస్ హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనతో చల్లబడితే. హౌస్ మాత్రం హీటెక్కిపోతోంది. వీకెండ్ ను జాలీగా ఎంజాయ్ చేసిన ఇంటి సభ్యులు ఫైనల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు.
బిగ్ బాస్ హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనతో చల్లబడితే. హౌస్ మాత్రం హీటెక్కిపోతోంది. వీకెండ్ ను జాలీగా ఎంజాయ్ చేసిన ఇంటి సభ్యులు ఫైనల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు. లాస్ట్ నామినేషన్లలో ఇంటిసభ్యులు విశ్వరూపం ప్రదర్శించారు. ఇన్నాళ్లు మనసులో దాచుకున్న విషయాలను బయటపెట్టారు. దీంతో హౌస్ మొత్తం ఒక్క సారిగా హాట్ హాట్ గా మారిపోయింది.
ఉల్టా పుల్టా అంటూ మొదలైన రియాల్టీ షో.. వారం వారం బిగ్ బాస్ తనదైన శైలిలో ట్విస్టులు, షాకులు ఇస్తూ వస్తున్నాడు. షో మరో రెండు వారాల్లో ముగియనుంది. 14వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ గరం గరం గా సాగింది. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాదోపవాదాలతో ఇళ్లు రణరంగంగా మారిపోయింది. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా అర్హత సాధించడంతో నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ సూచించగా..అమర్ కు మాత్రం షాక్ ఇచ్చాడు. కెప్టెన్ అయినప్పటికి ఇమ్యూనిటీ లేనికారణంగా నామినేట్ చేసే అవకాశం ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఫోటో స్టాంప్ ఒక టైల్ పై ముద్రించి దాన్ని బ్రేక్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్.. దీంతో ఈ నామినేషన్స్ ప్రక్రియ వేడివేడిగా సాగింది.
నామినేషన్ ప్రక్రియ తొలుత యావర్ ప్రారంభించాడు. యావర్ – శోభా శెట్టి, ప్రియాంకను నామినేట్ చేశారు. ఆ తర్వాత శోభా శెట్టి – యావర్, శివాజీ ని ని నామినేట్ చేసింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ – అమర్ దీప్, శోభా శెట్టిని.. అర్జున్ – అమర్ దీప్, యావర్ ను నామినేట్ చేశాడు. అయితే యావర్ అర్జున్ మధ్య బిగ్ వార్ నడిచింది. నెక్స్ట్ ప్రియాంక అమర్ దీప్ , యావర్ ను నామినేట్ చేసింది. ఇక శివాజీ ప్రియాంక, అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేయడంతో హౌజ్లో మాటల యుద్దం జరిగింది. ఒకరి మధ్య మరొకరితో వార్ జరిగింది. ఇదే సమయంలో అమర్ దీప్ అరేయ్ అంటూ పల్లవి ప్రశాంత్ ను పిలివగా.. రైతుబిడ్డ వద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ తర్వాత అమర్ దీప్ యావర్ ను నామినేట్ చేశాడు. నామినేషన్ల పర్వంతో హౌజ్ వాదనలతో హోరెత్తింది.