Big Boss Season7: సరికొత్త హంగులతో.. పూర్తి వినోదభరితంగా.. బిగ్ బాస్ సీజన్ 7.. తెలుగులో ఎప్పుడంటే..
బిగ్ బాస్ ఈ షో పేరు వినగానే మనకు చాలానే గుర్తుకొస్తాయి. గొడవలు, మాటలు, కాంట్రవర్సీలు, సెంటిమెంట్లు, ఎమోషన్లు, ప్రమోషన్లు అన్నీ ఒకే వేదికలో అందిస్తారు. ఇది ఒక రియాలిటీ షో. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగాది పచ్చడిలోని షడ్ రుచుల్లాగా అన్నీ కలిపిన వినోద కార్యక్రమం. ఇప్పటి వరకూ సాగిన బిగ్ బాస్ షో కి భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 7 ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లోగోను కూడా తాజాగా విడుదల చేశారు.

Bigg Boss Season 7 is all set to deliver an entertaining full of new twists
బిగ్ బాస్ షో చాలా భాషల్లో బహు ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా భాగమయ్యాయి. ఇటీవల విడుదల చేసిన లోగో ఆవిష్కరణ వీడియోలో ఫస్ట్ లుకు అదుర్స్ అని చెప్పాలి. గత ఆరు సీజన్లకు పూర్తి భిన్నంగా రూపొందించారు. దీనిని నియాన్ ఆకారంలో కనిపించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం మా టీవీలో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రేక్షకులను ఎప్పుడెప్పుడా అనే భావనలోకి నెట్టి ఆద్యంతం ఉత్కంఠను నెలకొల్పింది.
ఈ వీడియోలోని లోగో లో రెండు రంగులు కనిపిస్తున్నాయి. ఇవి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత యుగంలో చిన్న చిన్న అంశాలను కూడా ఇట్టే అరచేతిలో చూసేస్తున్నారు. వీటికి మించిన వినోదాన్ని, ఆనందాన్ని అందించాలన్న ఉద్ధేశ్యంతో ఈ షో లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ లోగో లోని రంగుల ప్రత్యేకత రెండు గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. మొదటిది నీలం.. ఇది ఉత్సాహానికి చిహ్నంగా చూసుకుంటే.. మరొక రంగు ఎరుపు.. ఇది అభిరుచిని సూచిస్తుంది. ఈ రెండింటి కలయికతో ఉత్సాహంతో కూడిన వినోదభరితమైన శక్తిని వెలువరించేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఈ డిజైన్ ను పూర్తిగా ఇంటర్నేషనల్ స్థాయి లుక్ లో అందరినీ అలరిస్తోంది.
టెలివిజన్ మాద్యమంలో ప్రస్తుతం ఉన్న వినోదాన్ని చూసి విసిగిపోయన వారికి సరికొత్త స్టైల్ లో ఉత్తేజమైన, ఉల్లాసభరితంగా.. ఆహ్లాదంతో పాటూ ఆసక్తిని రేకెత్తించేలా ఈ షోను డిజైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి షో ను మీరు తిలకించి.. మిమ్మల్ని మీరు మైమరచిపోవాలనుకుంటే బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం అయ్యే వరకూ ఎదురు చూడక తప్పదు. తాజాగా విడుదల చేసిన వీడియో సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసే ట్రైలర్ లా భావించవచ్చు. ఏది ఏమైనా స్టార్ మా బుల్లితెర మాద్యమంతో పాటూ డిస్నీ హాట్ స్టార్ లో వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.
T.V.SRIKAR