Bigg Boss season 7 : నామినేషన్ లో ఎనిమిది మంది.. ఈ సారి బయటకు ఎవరంటే..
ఎనిమిది వారాలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదివారంలో అల్లాడిస్తోంది. గొడవలు, అలకతో కావాల్సిందన కంటెంట్ ను బుల్లితెర వ్యూవర్స్ కి ఇస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారు.. వాటి స్ట్రాటజీ ఏంటో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రజెంట్ హౌస్ లో నామినేషన్ల పర్వం సాగుతోంది.

Bigg Boss season 7 which is running successfully for eight weeks is in its ninth week It is giving the viewers the content they want with riots and waves
ఎనిమిది వారాలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదివారంలో అల్లాడిస్తోంది. గొడవలు, అలకతో కావాల్సిందన కంటెంట్ ను బుల్లితెర వ్యూవర్స్ కి ఇస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారు.. వాటి స్ట్రాటజీ ఏంటో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రజెంట్ హౌస్ లో నామినేషన్ల పర్వం సాగుతోంది. గత నామినేషన్ల ప్రక్రియలతో పొలిస్తే చప్పగా సాగుతోందని చెప్పాలి. పైగా వీకెండ్ లో నాగార్జున క్లాస్ తీసుకుంటారన్న భయంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని నామినేషన్స్ వేస్తున్నారు. కొంత మంది రివేంజ్ నామినేషన్లతో రచ్చ వేస్తే.. మరికొందరూ సిల్లీ రిజన్స్ నామినేట్ చేసి.. నవ్వులు పూయించారు..
ఫస్ట్ రోజులు జరిగిన నామినేషన్ల గురించి ఇంట్లో చర్చ జరిగింది. తర్వాత.. బిగ్ బాస్ ఫీమేల్ స్పెషల్ లో భాగంగా ఇంట్లో ఉన్న అబ్బాయిలకు ఓ సూచన ఇచ్చాడు. అమ్మాయిలను మహారాణుల్లా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. దీంతో ఇంట్లో ఉన్న అబ్బాయిలు.. అమ్మాయిలకు తెగ సేవ చేసుకున్నారు. ఇక తేజ్ ను శోభాశెట్టి ఓ రేంజ్ లో ఆడేసుకుంది. ఏకంగా బ్రేష్ కూడా చేయించుకుంది. ఎవరికి వారు తమదైన స్టైల్ లో అమ్మాయిలకు సేవలు చేసుకున్నారు. కట్ చేస్తే.. బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియను రెండో రోజు మొదలు పెట్టాడు.
నామినేషన్స్ ప్రాసెస్ లో ముందుగా యావర్ ఫౌల్ గేమ్ ఆడావు అంటూ శోభా ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత అశ్వినిని నామినేట్ చేయగా.. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. శోభా రతికను నామినేట్ చేసింది. అమర్ బోలేను అర్జున్ నామినేట్ చేశాడు. అమర్ బోలే మధ్య మాటల యుద్ధం మొదలైంది. కానీ అమర్ మాత్రం ఎంత రెచ్చగొట్టిన.. హుందాగా ప్రవర్తించడంతో పాటు… తన తప్పులకు మళ్లీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఫైనల్ గా గౌతమ్ రతిక, అమర్ లను నామినేట్ చేశాడు. ఓ వైపు నామినేషన్ల ప్రాసెస్ జరుగుతుంటే.. అర్జున్, యావర్, ప్రశాంత్, శివాజీ నలుగురు కలిసి ‘ముస్తఫా.. ముస్తఫా ‘అంటూ పాట పాడుకున్నారు. ఈ వారం.. శోభాశెట్టి, ప్రియాంక, అమర్, అశ్విని, యావర్ తేజ, భోలే, రతిక, అర్జున్ నామినేట్ అయ్యారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.