BIGG BOSS 7: బిగ్‌బాస్ విజేతలు ఎక్కడ ? విన్నర్లు ఇప్పుడేం చేస్తున్నారు..?
బిగ్‌బాస్ వెళ్లొచ్చిన వారికి అవకాశాలు దక్కడం లేదని.. హౌస్‌లో విజేతలుగా నిలిచినా బయట మాత్రం ఓడిపోతున్నారనే టాక్ జనాల్లో ఉంది. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటివరకు లెక్కలేస్తే అదే నిజం అనిపిస్తోంది కూడా!
BIGG BOSS 7: తెలుగులో బిగ్‌బాస్ సీజన్ మొదలై ఏడేళ్లు అవుతోంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ సీజన్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ వెళ్లొచ్చిన వారికి అవకాశాలు దక్కడం లేదని.. హౌస్‌లో విజేతలుగా నిలిచినా బయట మాత్రం ఓడిపోతున్నారనే టాక్ జనాల్లో ఉంది. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటివరకు లెక్కలేస్తే అదే నిజం అనిపిస్తోంది కూడా!
SALAAR Vs DUNKI: దిగజారుడు.. సలార్‌పై విషం కక్కుతున్న బాలీవుడ్
బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా శివబాలాజీ నిలిచాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శివబాలాజీ.. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా యాక్ట్ చేశాడు. నటుడిగా మంచి పేరే ఉంది. ఐతే ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గాయ్. ఆ సమయంలో బిగ్‌బాస్ చాన్స్ వచ్చింది. సీజన్ వన్ విజేతగా నిలిచాడు. ఐతే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కెరీర్‌కు పెద్దగా బ్రేక్ రాలేదు. బిగ్‌బాస్ ముందు కూడా అంతో ఇంతో ఫాలోయింగ్ ఉండేది. ఈ షో తర్వాత ఆయన అంతగా పాపులర్ ఏమీ కాలేదు. క్లియర్‌గా చెప్పాలంటే.. బిగ్‌బాస్ తర్వాత శివబాలాజీ కనిపించకుండా పోయాడు. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసి గెలిచాడు. ప్రస్తుతం ‘మా’కు ట్రెజరర్‌గా పని చేస్తున్నాడు.
బిగ్‌బాస్ కెరీర్‌లో సీజన్ 2కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కౌశల్ మంద విజేతగా నిలిచాడు. ఏడేళ్ల బిగ్‌బాస్ హిస్టరీలో కౌశల్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. ఈ సీజన్‌లో ఆయన చేసిన హంగామా, హడావిడి ఏ కంటెస్టెంట్ చేయలేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేముందే.. బయట తనకంటూ పీఆర్‌ను సెట్ చేసుకుని.. కౌశల్ ఆర్మీగా దాన్ని పెంచి తెగ హడావిడి చేశాడు. హౌస్‌లో తనను వేరు చేస్తున్నారు అన్న సింపతీని క్యాష్ చేసుకుని ఓట్లు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను పీపుల్‌స్టార్‌గా ప్రకటించుకుని ట్రోలింగ్‌కు గురయ్యాడు కౌశల్. స్టార్‌గా ఎదగాలని ప్రయత్నించిన అతనికి.. చిన్న చిన్న షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, సోషల్ మీడియా హడావిడి తప్ప ఏమీ కలిసిరాలేదు. అంతకు ముందు వచ్చిన క్యారెక్టర్ రోల్స్ కూడా రాలేదు. ఇప్పుడు అతని అడ్రస్సే గల్లంతు అయింది. మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు.
HanuMan Trailer: వీరంగం.. విజువల్ వండర్ ‘హనుమాన్’..
బిగ్‌బాస్ విన్నర్స్‌లో అంతో ఇంతో ఇప్పుడు పేరు ఉంది అంటే.. రాహుల్‌కు ఒక్కడికి మాత్రమే. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత.. కొన్ని సినిమాల్లో చాన్స్‌లు దక్కించుకున్నాడు. ట్రిపులార్‌లో నాటు నాటు పాటతో పాపులర్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై ఆ పాటను ప్రదర్శించి రికార్డుకి ఎక్కాడు. బిగ్‌బాస్ విజేతల్లో ఎక్కువ లాభపడింది రాహులే ! ఓ ఇల్లు కొన్నాడు, నచ్చిన కారుకొన్నాడు. నాలుగో సీజన్ విజేతగా అభిజిత్ నిలిచాడు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. బిగ్‌బాస్‌లో మంచి పేరు వచ్చినా.. అదే పేరు బయటకు వచ్చాక రాలేదు. దీంతో ఆఫర్లు లేక వాల్డ్ టూర్లు చేస్తున్నాడు అభిజిత్. ఐదో సీజన్‌లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ ముందు సీరియళ్లలో యాక్ట్ చేసిన సన్నీ.. విజేతగా బయటకు వచ్చిన తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.
అడపాదడపా అవకాశాలు అందుకుంటూ హీరోగా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆరో సీజన్‌లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. అప్పటికే సింగర్‌గా, ఇండియన్ ఐడల్ విన్నర్‌గా పాపులర్ అయిన రేవంత్‌కి.. బిగ్‌బాస్ ద్వారా ప్రత్యేకంగా వచ్చిన ఫేమ్ ఏమీ లేదు. పాటల చాన్సుల విషయంలో కూడా పెద్దగా ఒరిగిందేమీదు. సీజన్ 7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమాయకత్వంగా ఉంటూనే ఇంటెలిజెంట్‌గా ఆట ఆడాడు. రైతు బిడ్డ అనే ట్యాగ్ ప్రశాంత్‌కు ఎంతో యూజ్ అయింది. మరి ఇప్పుడు బిగ్‌బాస్ ట్యాగ్ అతనికి ఎంతగా ఉపయోగపడుతుందన్నది చూడాలి మరి.