Bigg Boss 7 Telugu:: బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్లు వీళ్లేనా.. బ్యాంకాక్‌ పిల్ల అల్లరి చేయబోతోందా ?

బిగ్‌బాస్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈసారి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ఎంతమంది హౌస్‌లో కనిపిస్తారు.? తెలిసిన వాళ్లు ఉంటారా..? తెలియనివాళ్లను కూడా పట్టుకొస్తారా..? ఇలా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఐతే పార్టిసిపెంట్స్‌‌కు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 13, 2023 | 04:02 PMLast Updated on: Jul 13, 2023 | 4:02 PM

Bigg Boss Telugu 7 Bangkok Pilla Will Contest In The Show

Bigg Boss 7 Telugu:: బిగ్‌బాస్.. ఈ పేరు చెప్తే చాలు తెలియకుండానే ఓ ఉత్సాహం కనిపిస్తుంది బుల్లితెర ప్రేక్షకుల్లో! ఇదేం కాన్సెప్ట్ అనుకున్న వారితో కూడా.. ఇదిరా కాన్సెప్ట్ అనుకునేట్లు చేసిందీ షో. మధ్యలో అప్ అండ్ డౌన్స్ కనిపించినా.. ఈ రియాలటీ షోకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ముక్కూమొహం తెలియని వారు బిగ్‌బాస్‌ హౌస్‌లో కనిపించినా.. ఆసక్తిగా చూస్తుంటారు జనాలు. త్వరలో తెలుగు బిగ్‌బాస్‌ 7 స్టార్ట్ కాబోతోంది. ఈ షో హోస్ట్‌, పార్టిసిపెంట్స్‌కు సంబంధించి రకరకాల చర్చ జరుగుతోంది. ఇప్పటికే టైటిల్‌ లాంచ్‌ జరిగింది. దీంతో బిగ్‌బాస్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈసారి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ఎంతమంది హౌస్‌లో కనిపిస్తారు.? తెలిసిన వాళ్లు ఉంటారా..? తెలియనివాళ్లను కూడా పట్టుకొస్తారా..? ఇలా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఐతే పార్టిసిపెంట్స్‌‌కు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈసారి జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు.. బ్యాంకాక్‌ పిల్ల. యూట్యూబ్‌ చూసే చాలామందికి పరిచయం అవసరం లేని పేరు ఇది.

బ్యాంకాక్‌లో నివసించే ఆమె.. అక్కడి స్పెషాలిటీస్‌‌ను వ్లాగ్స్ రూపంలో పరిచయం చేస్తుంది. ఈమె అసలు పేరు శ్రావణి సమంతపూడి. ఈమె విజయనగరం స్లాంగ్‌.. ప్రతీ ఒక్కరిని ఫిదా చేస్తుంది. బ్యాంకాక్ పిల్ల ఈసారి బిగ్‌బాస్‌లో కనిపించనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ మధ్యే ఈ వ్లాగర్‌ బ్యాంకాక్‌లో ఇల్లు ఖాళీ చేసింది. బిగ్‌బాస్‌ కోసమే ఇలా చేసిందనే టాక్‌ వినిపిస్తోంది. బ్యాంకాక్‌ పిల్లతో పాటు.. అమరదీప్, తేజస్విని జంట.. సీరియల్ ఆర్టిస్ట్ శోభితా శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్‌తో పాటు.. హీరోయిన్ ఎస్తర్, యాంకర్ శశి.. ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయ్. ఐతే ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే.

బిగ్‌బాస్‌ 7 ఫైనల్‌ కంటెస్టెంట్లు ఎవరు అనేది.. షో మొదలయ్యేవరకు అధికారికంగా బయటకు రావు. ఇక ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సెట్ వర్క్ పూర్తవుతుంది. ఆగస్టు మొదట్లో ప్రోమో రిలీజ్ చేసి, సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.