Bigg Boss Telugu 7 Finale: కొనసాగుతున్న బిగ్ బాస్ ఫినాలె.. ఆ ముగ్గురు ఔట్..
టాప్ 6లో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్ అంబటి, ప్రియాంకా జైన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్‌లో చివరి వరకు మిగిలేది ఇద్దరే. వారిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవుతారు. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ కొనసాగుతోంది.

Bigg Boss Telugu 7 Finale: తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలె ఎపిసోడ్ షూటింగ్ కొనసాగుతోంది. టాప్ 6లో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్ అంబటి, ప్రియాంకా జైన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్‌లో చివరి వరకు మిగిలేది ఇద్దరే. వారిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవుతారు. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మొదట అర్జున్ అంబటి షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ప్రియాంక కూడా షో నుంచి ఎలిమినేట్ అయింది.
Anasuya Bharadwaj: పట్టుచీరలో తెలుగుదనం ఒలకబోస్తున్న అనసూయ భరద్వాజ్.. లేటెస్ట్ ఫొటోస్..
అయితే, వీరిద్దరికి ముందుగా బిగ్ బాస్ రూ.10 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సూట్‌కేసులో ఉన్న రూ.10 లక్షలు తీసుకుని, షో నుంచి వెళ్లిపోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. కానీ, అర్జున్, ప్రియాంక ఇద్దరూ దీనికి నిరాకరించారు. అయినప్పటికీ తర్వాత ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత హౌజ్‌లో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్ మిగిలారు. వీరికి బిగ్‌బాస్ మరో ఆఫర్ ఇచ్చాడు. రూ.10 లక్షల్ని రూ.15 లక్షలకు పెంచాడు. ఈ నలుగురికీ ఈ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఈ ఆఫర్ నచ్చిన యావర్ రూ.15 లక్షలు తీసుకుని షో నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. తన ఆర్థిక పరిస్థితి ప్రకారం.. ఈ డబ్బు తీసుకోవడం మంచిదే అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. షో విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ రూ.50 లక్షలులో ఈ రూ.15 లక్షలు తగ్గిస్తారు. దీని ప్రకారం.. షో విన్నర్‌కు టైటిల్‌తోపాటు రూ.35 లక్షల క్యాష్ అందుతుంది. అయితే, మిగిలిన అమౌంట్‌లోంచి కూడా కంటెస్టెంట్స్‌కు డబ్బు ఆఫర్ చేసే వీలుంది.
గతంలో కూడా కొందరు కంటెస్టెంట్ల ఇలా డబ్బు తీసుకుని షో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం హౌజ్‌లో టాప్-3గా శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు..? ఎవరు విన్నర్.. ఎవరు రన్నర్‌గా నిలుస్తారో చూడాలి. ఆదివారం సాయంత్రం ఫైనల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. సీజన్ 7 విజేత ఎవరో ఆదివారం రాత్రికి తెలుస్తుంది. ఇక.. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి.