Bigg boss: మర్డర్ కేసు.. బిగ్ బాస్ హౌస్‌లో హత్య.. విచారిస్తున్న అర్జున్, అమర్
యావర్, అమర్ దీప్, శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక, నామినేట్ అయ్యారు. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో ఎవరు బయటకు పోతారోనన్న టెన్షన్ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంటి సభ్యులు అందరూ అదే టాపిక్ గురించి చర్చించుకున్నారు.
Bigg boss: బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల రచ్చ జరుగుతోంది. మిగిలింది కొన్ని వారాలే కావడంతో నామినేషన్ల ప్రాసెస్ ఓ రేంజ్‌లో సాగింది. రెండ్రోజుల పాటు జరిగిన ప్రాసెస్ ఉత్కంఠగా సాగింది. సోమవారం కొంత మంది నామినేట్ కాగా.. మంగళవారం శివాజీతో నామినేషన్ల ప్రాసెస్ మొదలైంది. శివాజీ, గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత అశ్వినిని నామినేట్ చేయడానికి ప్రయత్నించగా.. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. సెల్ప్ నామినేట్ చేసుకున్న కారణంగా అశ్వినిని నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పడంతో శివాజీ అర్జున్‌ను నామినేట్ చేశాడు.
KCR on Farmers: అదే స్ట్రాటజీ ! వాళ్ళు ఓట్లేస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా..?
తర్వాత యావర్.. అమర్ దీప్‌తో పాటు అర్జున్‌ను నామినేట్ చేశాడు. యావర్, అమర్ మధ్య మాటల యుద్ధం నడించింది. శోభాశెట్టి.. అర్జున్, శివాజీని నామినేట్ చేసింది. ప్రియాంక.. శివాజీని, యావర్‌ను నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. యావర్, అమర్ దీప్, శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక, నామినేట్ అయ్యారు. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో ఎవరు బయటకు పోతారోనన్న టెన్షన్ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంటి సభ్యులు అందరూ అదే టాపిక్ గురించి చర్చించుకున్నారు. తర్వాత బిగ్ బాస్ మరోసారి ఎవిక్షన్ పాస్ కోసం పోటి నిర్వహించాడు. ఈ పోటీలో ఇంటిసభ్యులు అందరు పాల్గొన్నారు. పోటిలో ప్రశాంత్ విజేతగా నిలిచి.. ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. ఎవిక్షన్ పాస్ సాధించి ప్రశాంత్ ఖుషి అయ్యాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌కు బిర్యానీ పార్టీ ఇచ్చాడు బిగ్ బాస్. అర్జున్, అమర్ దీప్ మినహా మిగిలిన వారిని ప్రత్యేకమైన రూమ్‌కి పిలిచి ఫుల్ మీల్స్ పెట్టారు.
బిగ్ బాస్ భార్య ఇచ్చిన విందు అని, అందరూ ఎంజాయ్ చేయాలని సూచించాడు. మరోవైపు అర్జున్, అమర్‌లకు టాస్క్ ఇచ్చారు. ఎవరి వద్ద ఎలాంటి ఆహారం ఉంది..? హౌస్‌లో ఎంత ఆహారం ఉందో లెక్కించి బిగ్ బాస్‌కి తెలియజేయాలని తెలిపాడు. అనంతరం పెద్ద షాకిచ్చాడు బిగ్‌బాస్. హౌజ్‌లో బిగ్ బాస్ భార్య హత్యకు గురయ్యిందని.. విలువైన నగ మిస్ అయినట్టు చెప్పాడు. ఈ కేసుని విచారించే బాధ్యతని పోలీసులైన అమర్ దీప్, అర్జున్‌లకు అప్పగించాడు. హౌజ్‌లో హత్య వ్యవహారం కలకలం సృష్టించింది. హంతకుడు హౌజ్‌లోనే ఉన్నాడని చెప్పడంతో పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరి నేరస్థుడిని పట్టుకుంటారా లేదా అనేది చూడాలి.