Bigg Boss 7 : తేజ అవుట్.. తొమ్మిది వారాల రెమ్యునరేషన్ ఎంతంటే.. ?
లాస్ట్ కు రతిక (Ratika) - తేజ (Teja) ఇద్దరూ మిగడటంతో మరింత టెన్షన్ గా ఫీల్ అయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి .. ఎలిమినేట్ చేయొద్దని వేడుకోగా.. తన చేతిలో ఏం లేదని.. ఓటింగ్ ముగిసింది. ఎవరు ఎలిమినేట్ అవుతారో.. వారి పేరు బోర్డు మీద కనిపిస్తుందని నాగార్జున చెప్పాడు.

Bigg Boss weekend is over Nagarjuna felt angry After the entry he saved Gautham and played fun games with the house members Lawrence enters the Bigg Boss house
బిగ్ బాస్ (Bigg Boss) వీకెండ్ అయిపోయింది. నాగార్జున (Nagarjuna) అదుర్స్ అనిపించింది. ఎంట్రీ తర్వాత గౌతమ్ (Gautham) ను సేవ్ చేసి.. ఇంటి సభ్యులతో సరదా గేమ్స్ ఆడించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి లారెన్స్ (Lawrence) . ఎస్ ఎస్ సూర్య.. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. అంతేకాక పాటను ప్లే చేయించి ఇంటి సభ్యులతో హుక్ స్టెప్ ను వేయించాడు. తర్వాత.. కొన్ని సామెతలను ఇంటి సభ్యులకు ఇవ్వాలని నాగార్జున సూచించగా.. ఎక్కువ ట్యాగ్ లు అశ్విని పడ్డాయి. ఓ వైపు గేమ్స్ ఆడిస్తునే మరో వైపు మధ్య మధ్యలో కొంతమందిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు నాగార్జున. చివరికి యావర్, రతిక, తేజ ముగ్గురు మాత్రమే మిగలగా…యావర్ సేమ్ అయ్యాడు. అప్పటికే రతిక గుండెల్లో గుబులు మొదలైపోయింది.
లాస్ట్ కు రతిక (Ratika) – తేజ (Teja) ఇద్దరూ మిగడటంతో మరింత టెన్షన్ గా ఫీల్ అయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి .. ఎలిమినేట్ చేయొద్దని వేడుకోగా.. తన చేతిలో ఏం లేదని.. ఓటింగ్ ముగిసింది. ఎవరు ఎలిమినేట్ అవుతారో.. వారి పేరు బోర్డు మీద కనిపిస్తుందని నాగార్జున చెప్పాడు. అందరు అనుకున్నట్లుగా తేజ్ ఎలిమినేట్ అయ్యాడు. తేజ తన ఎలిమినేషన్ ని పాజిటివ్ గా తీసుకున్నాడు. కన్నీరు పెట్టుకోకుండా.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తేజ ఎలిమినేషన్ అవ్వడంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యాడు.
స్టేజ్ పైకి వచ్చిన తేజ.. తన ఏవీ ను చూసుకుని.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఇంటిసభ్యులకు మార్కులు ఇచ్చాడు. తేజ ఏదైనా కుండబద్దలు కొట్టే తేజ .. తొమ్మిది వారాలకు గాను 13. లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారానికి 1.5 లక్షల ఒప్పందంపై హౌస్ లో అడుగు పెట్టి… తన స్లో అడుగుపెట్టాడట. తొమ్మిది వారాలకు గాను రూ. 13.5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట. ఇతర సెలెబ్స్ తో పోల్చుకుంటే ఇది తక్కువ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. తొమ్మిది వారాలు ముగియడంతో.. మళ్లీ ఇంట్లో నామినేషన్ల రచ్చ మొదలైంది. మరీ పదో వారంలో నామినేషన్స్ లో ఎవరు ఉన్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.