Bigg Boss7: ఎమోషనల్ సర్‌ప్రైజ్.. కన్నీళ్లు పెట్టిన అమర్, అర్జున్
అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్‌ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు.

Bigg Boss7: బిగ్‌బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేసింది. ఉల్టా పుల్టా సీజన్ తుది దశకు చేరుకుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే విన్నర్ ఎవరన్నదానిపై ఆడియన్స్ అప్పుడే ఊహాగానాలు మొదలు పెట్టేశారు. ఇక.. ఈ వారం రోజులను కంటెస్టెంట్స్ కోసం అద్భుతంగా ప్లాన్ చేశారు బిగ్‌బాస్.. ఫైనలిస్ట్‌లకు హౌస్‌లో తమ జర్నీని అందంగా చూపించారు. నిన్నటి ఎపిసోడ్లో ముందుగా అమర్ దీప్, అర్జున్ ఇద్దరి బిగ్‌బాస్ జర్ని వీడియోలను చూపించారు.
SAI PALLAVI: ముచ్చటగా మూడు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో పట్టేసిన సాయిపల్లవి
అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్‌ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అమర్ అమాయకత్వం.. అల్లరి.. కోపం.. తప్పులు చేసి దొరికిపోవడం.. సరుకులు దాచుకోవడం నుంచి మొదటి ఐదు వారాలు హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాసులు తీసుకోవడం వరకు ఇలా ప్రతి క్షణాన్ని చూపించారు. ఈ వీడియో చూసిన అమర్ అన్ని రకాలుగా ఎమోషనల్ ఫీలయ్యాడు. నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. తన భార్య తేజును చూసి ఎమోషనల్ అయ్యాడు. చివరకు అల్టిమేట్ బిగ్‌బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత అర్జున్‌ని కూడా పిలిచారు బిగ్‌బాస్.. అర్జున్‌కు కూడా బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూపించారు. తన బిగ్‌బాస్ ప్రయాణంలోని ఫొటోల్ని చూసి అర్జున్ తెగ మురిసిపోయాడు.
కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్‌గా వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. తన భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే.. చివరి వారాన్ని చాలా హ్యాపీ మెమొరీస్‌తో, చాలా పాజిటివ్‌గా ఎండ్ చేద్దామని బిగ్‌బాస్ ఫిక్సయినట్లు అర్థమవుతోంది. నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేకుండా.. కేవలం కంటెస్టంట్ల ఎమోషన్స్‌ను మాత్రమే బయటకు తీసుకొచ్చి.. ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.