పవన్ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్… వెయిటింగ్ మళ్ళీ పెరిగిందా…?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు మళ్ళీ దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మూడు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాల్లో నటిస్తారు అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు మళ్ళీ దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మూడు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాల్లో నటిస్తారు అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. కాని ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలువురు నిర్మాతలు, దర్శకులు వెళ్లి పవన్ ను కలిసారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమాలు మొదలుపెట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఏకంగా డిసెంబర్ లో ఒక సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
అలాగే వేసవిలో ఒక సినిమాను విడుదల చేస్తారనే టాక్ వచ్చింది. కాని ఇప్పుడు మళ్ళీ ఆలస్యం అయ్యే విధంగా పరిస్థితి కనపడుతోంది. దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఇప్పుడు విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీ వరదలతో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడను సాధారణ స్థితికి తీసుకు రావాలంటే కనీసం ఆరు నెలలపైగానే పట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి వెళ్తే మాత్రం కచ్చితంగా అది నెగటివ్ అయ్యే అవకాశం ఉంటుంది.
విపక్షాల నుంచి విమర్శల సంగతి పక్కన పెడితే… ప్రజల్లో కూడా పవన్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. పలు కారణాలతో పవన్ కళ్యాణ్ వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాని వెనుక ఉన్న కారణం ఆయన వివరణ ఇచ్చారు. అక్కడి వరకు అది ఓకే గాని… ఇప్పుడు పరిస్థితి ఒక దారికి రాక ముందే సినిమాల షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ లో ఉంటే మాత్రం విమర్శలు గట్టిగానే వచ్చే అవకాశం ఉంటుంది. అది పార్టీకి కూడా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. అందుకే సినిమాలకు మరికొంత కాలం దూరంగా ఉండాలని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.