బర్త్ డే బంపర్ ఆఫర్… గ్లోబల్ ప్రోమోతో తేలేది…?

ఎన్టీఆర్ తో కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేసి, గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. కాని ఆతర్వాతే కాలం కలిసి రాలేదు. ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండీటి విషయంలో రామ్ చరణ్ ని దర్శకులు మోసం చేశారనే మాటే వినిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 06:20 PMLast Updated on: Mar 27, 2025 | 6:20 PM

Birthday Bumper Offer With Global Promo

ఎన్టీఆర్ తో కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేసి, గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. కాని ఆతర్వాతే కాలం కలిసి రాలేదు. ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండీటి విషయంలో రామ్ చరణ్ ని దర్శకులు మోసం చేశారనే మాటే వినిపించింది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు మేకింగ్ లో చరన్ కంప్లీట్ గా తన రూటే మార్చేశాడనే ప్రచారం జరిగింది. ఐతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కి ఒకరోజు ముందే భారీ ఎత్తున ప్రోమోని ప్లాన్ చేసిన టీం కి, రెహమాన్ బ్రేక్ వేశాడు. అందుకే బర్త్ డే రోజే బంపర్ ఆఫర్ అనేసింది ఫిల్మ్ టీం. సో ఏడాది తర్వాత రిలీజ్ అయ్యే మూవీకి ఇప్పడు ప్రోమో ఇవ్వాలా? లేదంటే మోషన్ టీజర్ తో బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలా అని రెండు వారాలుగా బుచ్చి బాబు టీం తెగ టెన్షన్ పడుతోంది. కాని ఆట కూలీగా చరణ్ చేస్తున్న పీరియాడికల్ సాహసం, నిజంగానే మెగా షాక్ వేవ్ ని క్రియేట్ చేసేలా ఉంది. బర్త్ డే బంపర్ ఆఫర్ మతిపోగొట్టేలా ఉంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చి బాబు తీస్తున్ మూవీ వర్కింగ్ టైటిల్ పెద్ది అన్నారు. తర్వాత చాలా పేర్లు వినిపించాయి. ఈమధ్యే ఇందులో తను వేసిన పాత్ర ఆట కూలంటూ ప్రచారం కూడా జరిగింది. అరడజన్ ఆటలు ఆడే ఆట కూలీగా చరణ్ చేస్తున్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాకి శ్రీకాకులం మహాభలి కోడి రామమూర్తి నాయుడి పాత్ర ప్రేరణ అని ప్రచారం కూడా జరిగింది.మొత్తంగా రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎంత కష్టపడ్డా, ఆచార్య, గేమ్ చేంజర్ పంచ్ ల నుంచి ఈ మూవీ తనని కాపాడితేనే ఫలితం దక్కే అవకాశం ఉంది. ఐతే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా, వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవుతుందా తేలలేదు. ఎంత లేదన్నా మేకింగ్ కే కనీసం ఏడాది టైం పడుతుంది. అలాంటప్పుడు రామ్ చరణ్ బర్త్ డే వచ్చిందని, ఎందుకు హడావిడిగా టీజర్ లాంచ్ చేయాలన్న డిస్కర్షన్ టీంలో జరిగింది.

దీనికి ఏ ఆర్ రెహమాన్ కూడా కారణమేనట. వారం రోజుల క్రితే ప్రోమో రెడీ చేసినా, దానికి బ్యాగ్రౌండ్ స్కోరుని రెహమాన్ అందించలేదు. దానికి తన వైఫ్ తోపాటు, తన హెల్త్ కండీషన్ కూడా కారణం.. ఏదేమైనా ఫైనల్ గా రెహమాన్ ఈమూవీ ప్రోమోకి స్కోర్ అందించాడు. అందుకే బర్త్ డే కి ఒకరోజు ముందు కాకుండా, బర్త్ డే రోజే ప్రోమో అని ప్రచారం జరిగింది.ఇక రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీస్తున్ ఈ సినిమా నిజంగా పాన్ ఇండియాని షేక్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే, అరడజన్ కి పైనే ఉన్నాయని తేలింది. క్రికెట్, కబడ్డి, కుస్తీ తో పాటు మరో మూడు ఆటలాడే సూపర్ ప్లేయర్ గా చరణ్ కనిపించబోతున్నాడు. తన పాత్ర, ఆటలు, వీటిలో భాగంగా తోడొచ్చే వెటరన్ ప్లేయర్స్ డెఫినెట్ గా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఎలాగూ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమానే చరణ్ కి వెళ్లింద కాబట్టి, తను కాని పవన్ కళ్యాణ్ కాని ఏదైనా మూవీ పక్కన పెడితే, ఆ మూవీ మరొకరు చేస్తే హిట్టైన సందర్భాలే ఎక్కువ. ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి మాత్రమే కాదు నువ్వు నాకు నచ్చావ్ కూడా పవన్ చేయాల్సిన మూవీలే. కాని తనకు కుదరకపోవటం వల్ల, అటు రవితేజ, ఇటు వెంకీకి మంచి హిట్లు పడ్డాయి. ఎన్టీఆర్ లైట్ తీసుకున్న కథలతో కూడా మిగతా హీరోలకి కాలం కలిసొచ్చింది. అలాంటిది ఎన్టీఆరే దగ్గరుండి ఈ కథని చరణ్ దగ్గరకు పంపించాడు కాబట్టి, పక్కగా హిట్ అవుతుందనేలా టీజర్ వచ్చిందంటున్నారు. రెహమాన్ స్కోర్ ఇవ్వకముందే ఈ టీజర్ చూసేసిన బుచ్చిబాబు టీం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. బర్త్ డే కి బంపర్ ఆఫర్ అదిరినట్టే అని తెలుస్తోంది.