పుష్ప 2: ఆ ఒక్క సీన్ చాలు వెయ్యి కోట్లు రావడానికి
ఇండియాలో చాలా సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి గాని పుష్ప 2 రేంజ్ లో మాత్రం ఏ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై జనాల్లో పిచ్చి ఉంది.
ఇండియాలో చాలా సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి గాని పుష్ప 2 రేంజ్ లో మాత్రం ఏ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై జనాల్లో పిచ్చి ఉంది. పార్ట్ 1 హిట్ మాత్రమే… కాని పార్ట్ 2 పై ఉన్న అంచనాలు చూస్తుంటే… బొమ్మ బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడు అనే ధీమాలో ఉన్నారు ఆడియన్స్ కూడా. ఈ సినిమాతో బన్నీ ఇండియన్ సినిమాను షేక్ చేయడం పక్కా అంటూ ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఇక బన్నీ సినిమా ప్రమోషన్స్ పై చాలా సీరియస్ గా ఫోకస్ చేసాడు.
ఇండియాలో ఇప్పుడు ఏ సినిమాపై లేని బజ్ పుష్పపై క్రియేట్ అయింది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ కు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నా… నార్మల్ ఆడియన్స్ లో సినిమాపై హైప్ ఉండటంతో పెద్దగా త్రోలింగ్ వర్కౌట్ కావడం లేదనే చెప్పాలి. ఇక సినిమాకు సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 3 గంటల 20 నిమిషాలు ఉండనుంది రన్నింగ్ టైం. నిర్మాతలు కూడా సినిమా పెద్దది అయినా… సినిమా చూసే వాళ్ళు అలా ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు అని… బొమ్మ బ్లాక్ బస్టర్ కాబట్టి టైంను ఆడియన్స్ పట్టించుకోరు అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక లేటెస్ట్ గా వచ్చిన ఒక న్యూస్ చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమైపోతుంది. పుష్ప 2 సెన్సార్ పూర్తి కాగా… మూడు బీప్స్ తో U/A సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు కాగా… జపాన్ ఎపిసోడ్ తో సినిమా మొదలు అవుతుంది. జాతర ఎపిసోడ్ 25 నిమిషాల జాతర ఎపిసోడ్ తోనే పైసా వసూల్. అంటే ఆ ఎపిసోడ్ కోసమే సినిమాకు ఆడియన్స్ వెళ్ళవచ్చు. సినిమా వసూళ్లను మొత్తం జాతర ఎపిసోడ్ డామినేట్ చేస్తుందని డైరెక్టర్ సుక్కు పక్కా లెక్కతో ఉన్నాడు. అక్కడ ప్లాన్ చేసిన యాక్షన్ సీన్ ట్రెండ్ సెట్టర్ కానుంది.
మాస్ అప్పీల్ తో సాగిన క్లైమాక్స్ ఫైట్… కాళ్లూ చేతులూ కట్టేసినా హీరో చేసే విధ్వంసం కళ్లారా చూడాల్సిందే అంటూ మేకర్స్ ధీమాగా ఉన్నారు. పార్ట్ 3 ఉందని చెప్పారు కానీ, గ్లింప్స్ లాంటివేం లేవట. పుష్ప – శ్రీవల్లి మధ్య ఎమోషన్ సినిమాకు హైలెట్ కానుంది. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం వారి మధ్య సీన్స్ తోనే ఖాయం అంటూ మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తంగా చూస్తే పుష్ప 1ని మర్చిపోవడం ఖాయం అని… సినిమా చూసి వచ్చిన వాళ్ళు కచ్చితంగా… అదే ఫోబియాలో ఉంటారని మేకర్స్ బల్ల గుద్ది చెప్తున్నారు.