పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా కాకపోయినా సరే సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే హడావుడి వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక సినిమా మేకర్స్ కూడా దాని గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో సినిమాను హైలో ఉంచుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాను ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ 90% కంప్లీట్ అయిపోయింది. మరో 10% షూటింగును త్వరలోనే కంప్లీట్ చేసి సినిమాను మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక వైపు రాజకీయాల్లో అలాగే పరిపాలనలో బిజీగా ఉన్నా సరే ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అనే న్యూస్ కూడా ఇప్పుడు వస్తుంది. వాస్తవానికి సంక్రాంతి కానుక రిలీజ్ చేస్తారని చాలామంది ఎదురు చూసినా అది వాయిదా పడుతూ వచ్చింది. జనవరి 26 కి రిలీజ్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో కంటే చాలా కొత్తగా కనపడుతున్నారు. దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ అంటే యాక్షన్ హీరో అనే ఫీల్ నుంచి బయటకు తీసుకురావడానికి డైరెక్టర్ కథ విషయంలో గట్టిగానే సానపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టే తన లుక్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్న బాబి సినిమా గురించి మాట్లాడుతూ హరిహర వీరమల్లు స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్ స్క్రిప్ట్ అన్నాడు. చాలా అరుదుగా అలాంటి కథలు వస్తాయని గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్ గా మాస్ గా కూడా ఉంటాయని.. మొదటిసారి కథ విన్నపడే ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాంటి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కామెంట్ చేశాడు బాబి. డాకు మహారాజ్ సినిమాలో విలన్ గా నటించిన బాబి ఆ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉన్నాడు. యానిమల్ సినిమాతో బిజీ అయిపోయిన ఈ స్టార్ యాక్టర్.. తెలుగు సినిమాల్లో కంటిన్యూగా ఆఫర్లు కొట్టేస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలకు బాబీ డియోల్ ను డైరెక్టర్లు అప్రోచ్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ దుమ్ము రేపుతున్నాడు బాబి. అటు బాలీవుడ్ లో కూడా బాబీ డియోల్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.[embed]https://www.youtube.com/watch?v=qnFjwI4NRLE[/embed]