స్టార్ హీరోల బాడీ గార్డుల జీతాలు తెలిస్తే మైండ్ బ్లాక్

స్టార్ హీరోలు అంటే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు అన్నీ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. రేంజ్ కి తగ్గట్టు జనాల్లో తిరగాలి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే తమ రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 12:09 PMLast Updated on: Sep 16, 2024 | 12:09 PM

Body Guards Salary For Star Heros

స్టార్ హీరోలు అంటే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు అన్నీ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. రేంజ్ కి తగ్గట్టు జనాల్లో తిరగాలి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే తమ రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కనపడటానికి సింపుల్ గా కనపడినా వాళ్ళ కార్లు, వాళ్ళ వాచీలు ఇలా అన్నిటికి భారీగానే ఖర్చు చేస్తారు. ఇక భద్రత మీద కూడా హీరోలు ఎక్కువగానే దృష్టి పెడుతూ ఉంటారు. తాము బయటకు వెళ్తే తమ భద్రతకు ముప్పు రాకుండా, అభిమానుల తాకిడి ఎక్కువైనప్పుడు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టి బాడీ గార్డ్ లను నియమించుకుంటారు హీరోలు. ఈ నేపధ్యంలో ఒక్కో బాడీ గార్డ్ కి స్టార్ హీరోలు ఎంత ఖర్చు చేస్తారు అనేది చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. షారూఖ్ ఖాన్ బాడీ గార్డ్ ఏడాదికి సంపాదించే జీతం తెలిస్తే మాత్రం షాక్ అవ్వడమే. షారూఖ్ బాడీ గార్డ్ రవీ సింగ్ జీతం ఏడాదికి 2.7 కోట్లు. అక్షరాలా రెండు కోట్ల 70 లక్షల రూపాయలు తీసుకుంటాడు. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షేరా జీతం ఏటా రెండు కోట్లు ఉంటుంది. సల్మాన్ కు ఇటీవల ప్రాణ హాని ఉందనే వార్తలు వస్తున్నాయి.

దీనితో కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇక అమీర్ ఖాన్ బాడీ గార్డ్ యువరాజ్ జీతం కూడా ఏడాదికి రెండు కోట్లు. అలాగే బిగ్ బీ అమితాబ్ బాడీ గార్డ్ జితేంద్ర జీతం ఏడాదికి కోటి 50 లక్షల వరకు ఉంటుంది. అలాగే అక్షయ్ కుమార్, హ్రితిక్ రోషన్ బాడీ గార్డులకు చెరో కోటి 20 లక్షలు ఇస్తున్నారు. వీళ్ళకు జీతాలతో పాటుగా వ్యక్తిగత అలవెన్స్ లు కూడా ఉంటాయి. వాళ్లకు ప్రత్యేకంగా ఓ కార్ కూడా ఇస్తారు. అలాగే భోజనం, విమానం టికెట్ లు, స్టార్ హోటల్స్ లో స్టే చేసేందుకు వాళ్లకు ఉచితమే. హీరో ఉండే హోటల్ రూమ్ పక్కనే వాళ్లకు కూడా మరో రూమ్ ఉంటుంది. ఇలా కోట్ల రూపాయల జీతం లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు బాడీ గార్డులు.