Pushpa2: పుష్ప‌-2లో మ‌రో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగ‌య్యా సామీ..!

ఇక‌.. పుష్ప‌-2 మూవీ పార్ట్‌-1 ను మించి ఉండ‌బోతోంద‌న్న లీకులు ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మూవీ వెయిట్‌ను అమాంతం పెంచేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2024 | 12:47 PMLast Updated on: Mar 09, 2024 | 12:47 PM

Bollywood Actor Sanjay Dutt In Allu Arjuns Pushpa2

Pushpa2: ప్రజెంట్ సినీ లవర్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న సినిమాలలో పుష్ప‌-2 కూడా ఒక‌టి. పుష్ప‌గా అల్లు అర్జున్ హిల్లీరియ‌స్ యాక్టింగ్‌కి బాగా క‌నెక్ట్ అయిపోయిన ఫ్యాన్స్.. సెకండ్ పార్ట్‌లో పుష్ప గాడి రూలింగ్ కోసం ఫ్యాన్స్ ఎంత‌గా వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే అభిమానులు పిచ్చెక్కినట్లు ఊగిపోతున్నారు. ప్ర‌తి అప్‌డేట్‌ను వైర‌ల్ చేస్తూ సోష‌ల్ మీడియాను అల్ల‌ల్లాడిస్తున్నారు.

KALKI 2898 AD: కల్కిలో ప్రభాస్ పాత్ర పేరెంటో తెలుసా..? కొత్త పోస్టర్ రిలీజ్

ఇక‌.. పుష్ప‌-2 మూవీ పార్ట్‌-1 ను మించి ఉండ‌బోతోంద‌న్న లీకులు ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మూవీ వెయిట్‌ను అమాంతం పెంచేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక పుష్ప‌-2లో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌ని ఇప్ప‌టికే టీమ్ ప్ర‌క‌టించింది. ఇప్పుడు రీసెంట్‌గా పుష్ప 2 నుంచి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 మూవీలో మరో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నాడట. ఆ స్టార్ యాక్టర్ ఎవరో కాదు సంజయ్‌ దత్‌. అవును.. ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్‌ను తీసుకున్నారట మేకర్స్. ఆయన కనిపించేది 7 నుంచి 10 నిమిషాలు అయినా కూడా సినిమాకు అత్యంత కీలకమైన పాత్రగా ఉంటుంద‌ట‌. నార్త్‌లో సంజ‌య్‌ద‌త్‌కు ఉన్న క్రేజ్ మ‌నంద‌రికీ తెలిసిందే. ఆయ‌న్ను ఈ మూవీలోకి తీసుకోవ‌డం ద్వారా బిజినెస్ పరంగా పుష్ప 2 మ‌రింత క‌లిసొస్తుంద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

కాగా సంజ‌య్ ద‌త్‌ది ఈ సినిమాలో నెగిటివ్ కాకుండా.. పాజిటివ్ పాత్ర అని చెబుతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్.. సౌత్‌లో ‘కేజీఎఫ్ 2’, బీస్ట్ మూవీలతో పలకరించారు. త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో పలకరించారు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’లో కూడా నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు పుష్ప 2 మూవీలో ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అయాన్‌పై కొన్ని సీన్స్‌ను టెస్ట్ షూట్ చేసి సుకుమార్ ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా వ‌రుస స‌ర్‌ప్రైజ్‌ల‌తో తెర‌కెక్కుతున్న పుష్ప‌-2 మూవీ రిలీజ్ అయిన త‌ర్వాత క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్ట‌డంలో ఎలాంటి అరాచ‌కం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.