Bollywood: దీపికా రణవీర్ మధ్య మళ్ళీ గొడవలు.. ఎడ ముఖం ..పెడ ముఖం
దీపిక పదుకునే, రణ్వీర్ సింగ్ పెళ్ళై ఐదేళ్లవుతోంది. మూడేళ్ల వరకు ఎలాంటి గాసిప్పూ లేదు. గత రెండేళ్ల నుంచి విడిపోతున్నారంటూ ఒకటే వార్తలు. వీళ్ల చేష్టలు ఎన్నో కథనాలు పుట్టించేలా చేసింది. విడిపోయారంటున్నారు.. మళ్లీ కలిసే వుంటున్నారంటూ వార్తలు. రీసెంట్‌గా దీపిక పదుకునే చేసిన నిర్వాకంతో.. బ్రేకప్ వార్తలకు మళ్లీ ఊపిరిపోసినట్టయింది.
దీపిక పదుకునే, రణ్వీర్ సింగ్ విడిపోయారంటూ వచ్చిన ప్రతిసారీ ఈ జంట చేయి చేయి పట్టుకుని ఈవెంట్స్‌కు కలిసొచ్చేవారు. అన్యోన్యంగానే వున్నారు.. విడిపోలేదని చెప్పకనే చెప్పేవాళ్లు. అయితే.. రీసెంట్‌గా జరిగిన స్పోర్ట్స్ అవార్డ్స్ ఈవెంట్‌లో దీపిక ప్రవర్తన షాకిచ్చింది. ఇద్దరూ కలిసే వచ్చినా.. చేయి చేయి పట్టుకుని నడవలేదు. ప్రతిసారీ ఇలాగే నడవాలని రూలేమీ లేకపోయినా.. కలిసినడుద్దామని రణ్వీర్ చేయి అడిగితే.. దీపిక పట్టించుకోనట్టు వ్యవహరించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీపిక పదుకునే చేయి ఇవ్వకపోవడంతో.. రణ్వీర్ గిల్టీగా ఫీయ్యాడు. మళ్లీ గొడవులు వచ్చాయని కథనాలు పుట్టుకొస్తున్నాయి.
అయితే.. విడిపోయిన వాళ్లు కలిసి ఇలా ఈవెంట్‌కు వస్తారా? అని సమర్దించేవాళ్లూ వున్నారు. అయితే.. దీపిక కలిసి నడవడానికి ఇష్టపడకపోవడంతో.. ఫొటో సెషన్‌లో దీపికపై చేయి వేసిన రణ్వీర్ మళ్లీ ఏందుకో తీసేసి నుంచున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ.. హగ్ చేసుకుంటూ.. ముద్దులు పెట్టుకుని కనిపించే జంట ఈసారి ఎందుకో అన్ ఈజీగా కనిపించారు. చేతులో చేయ్యేసి కలిసి నడవడానికి దీపిక ఇష్టపడలేదని క్లియర్ కట్ గా తెలుస్తోంది.
రామ్-లీలా సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. రణ్‌వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే రూమర్స్ వినిపించాయి. గెహ్రాయియాన్‌లో దీపిక మితిమీరిన రొమాంటిక్ ఇంటెమెసీ సీన్స్ వల్ల విబేధాలు వచ్చాయన్నది మరో రీజన్. అయితే విడాకుల రూమర్స్‌పై దీపికా కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. రణ్‌వీర్‌తో అంతా బాగానే ఉందని తెలిపింది.
విడపోలేదంటూ రణ్‌వీర్, దీపిక పోస్టులు పెట్టారేగానీ.. కలిసి కనిపించకపోవడంతో ఇలాగే చెబుతారంటూ లైట్‌గా తీసుకున్నారు. ఆమధ్య జీ క్యూ మెన్ అవార్డ్ ఫంక్షన్‌కు చేయి చేయి కలుపుకుని రావడంతో ఈ ఇద్దరూ కలిసే వున్నారని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈసారి ఏకంగా పబ్లిక్‌లో కలిసి నడుద్దామని రణ్‌వీర్ అడిగినప్పుడు దీపిక హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య డిపరెన్సెన్స్ వున్నాయని అర్థమైంది. భార్యాభర్తలన్న తర్వాత వివాదాలు కామనే.. చిన్నపాటి గొడవ పడివుంటారు. అందుకే ఇలా వున్నారంటూ… ఈ జంటను అభిమానించే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి దీనికి బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.