Sherlyn: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటా.. శృంగార తార సంచలన వ్యాఖ్యలు
షెర్లిన్ చోప్రా.. బాలీవుడ్ సినిమాల గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికి పరిచయం ఉండే పేరు ఇది. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో.. షెర్లిన్ కూడా నిందితురాలిగా ఉంది.

Bollywood actress Sherlyn made sensational comments on whether she will marry Rahul Gandhi
రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. శృంగార వీడియోల్లో నటించాలని రాజ్ కుంద్రా తనను బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. షెర్లిన్ యాక్ట్ చేసిన పౌరాష్‌పూర్ 2 వెబ్ సిరీస్ ఈ మధ్యే రిలీజ్ అయింది. దీనికోసం ప్రమోషన్స్ మొదలుపెట్టిన షెర్లిన్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ అంటే తనకు చాలా ఇష్టమని.. అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది.
ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఐతే రాహుల్ కోసం పెళ్లికి అమ్మడు ఓ కండిషన్ కూడా పెట్టింది. రాహుల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంటి పేరు మార్చుకోవడం ఇష్టం లేదని అంటోంది. అది రాహుల్ స్వీకరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారింది. షెర్లిన్ కామెంట్స్‌పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఆలూ లేదు సూలూ లేదు.. సన్ నేమ్ సోమలింగం అంటే ఇదే అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాహుల్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడమే ఓవర్ అంటే.. ఇంటి పేరు మార్చకోను అంటూ రాహుల్‌కే కండిషన్స్ పెట్టడం ఓవర్‌కే ఓవర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.