1000 కోట్ల బలాన్ని… 1000 కోట్లతోనే అడ్డుకున్నారా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ని బాలీవుడ్ లో చాలా మంది ముందు తక్కువ అంచనావేశారు.. త్రిబుల్ఆర్ హిట్టయ్యాక అంతా రాజమౌళి వల్లే కదా అన్నారు... తనకంత సీన్ లేదన్నారు. కట్ చేస్తే దేవర దరువుతో బాక్సాఫీస్ కరువు తీరింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ని బాలీవుడ్ లో చాలా మంది ముందు తక్కువ అంచనావేశారు.. త్రిబుల్ఆర్ హిట్టయ్యాక అంతా రాజమౌళి వల్లే కదా అన్నారు… తనకంత సీన్ లేదన్నారు. కట్ చేస్తే దేవర దరువుతో బాక్సాఫీస్ కరువు తీరింది. ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియన్స్ లో పూనకాలొచ్చాయి కాబట్టే, కేవలం నార్త్ ఇండియాతో పాటు టాలీవుడ్ వసూళ్లే 500 కోట్లు దాటాయి… ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో వెయ్యికోట్ల స్టామినా ఉందని ఎన్టీఆర్ తో పాటు చరణ్ ప్రూవ్ చేసుకున్నాడు. దేవరతో మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే థౌఝెండ్ వాలా అని ప్రూవ్ అయ్యింది. కాకపోతే ఈ వెయ్యికోట్ల బలాన్ని అదే వెయ్యికోట్లతో అడ్డుకునే ప్రయత్నం జరిగింది. జరుగుతోంది.మొత్తంగా పాన్ ఇండియా లెవల్లో రెండు వేల కోట్ల యుద్ధమే జరుగుతోంది. ఏనుగుని ఆపాలంటే, ఏనుగే దిగిరావాల్సిందే…… అలాంటి పరిస్థితి ఎన్టీఆర్ మూవీకి ఎదురైంది… ఇంతకి ఏంజరిగింది..?
ఎన్టీఆర్ పాన్ ఇండియా దూకుడికి బ్రేక్ వేయాలంటే, మళ్లీ పాన్ ఇండియా మూవీనే సీన్లోకి తెస్తే సరిపోతుందా? నిజం చెప్పాలంటే గతంలో అలాంటి ప్రయత్నం జరిగింది. దేరవకి పోటీగా తమిళ సూపర్ స్టార్ మూవీ వెట్టయాన్ వచ్చింది. కాని ఏమైంది. సీన్ రివర్స్ అయ్యింది. దేవర దరువుముందు అసలా మూవీ వచ్చి వెళ్లిందనే విషయమే జనం మర్చిపోయే పరిస్థితొచ్చింది.
ఎన్టీఆర్ పాన్ ఇండియా దూకుడుని, మరో పాన్ ఇండియా మూవీ ఆపలేదని ఇంతక్లియర్ గా తేలిపోయింది. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ పాన్ ఇండియా జోరుకి మాత్రం ఒక దర్శకుడు సక్సెస్ ఫుల్ గా బ్రేక్ వేశాడు. అందుకు మరో పాన్ ఇండియా మూవీనే బ్రహ్మాస్త్రం గా వాడాడు..
దేవర మూవీతో నార్త్ తో పాటు, తెలుగులో 500 కోట్ల పైనే వసూల్లు రాబట్టిన ఎన్టీఆర్, ఎవరేమన్నా, నార్త్ ఇండియాలో కూడా మాస్ కి సూపర్ మాస్ హీరో… అంతగా ఉత్తరాది మాస్ లోకి దేవర దూసుకెళ్ళాడు..
అలాంటి ఈ హీరోతో కేజీయఫ్, సలార్ ఫేం ప్రశాంత్ నీల్ సినిమా ప్లాన్ చేశాడు.
డ్రాగన్ టైటిల్ తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు కూడా..కాకపోతే, ప్రశాంత్ నీల్ కెరీర్ లో రెండో హ్యాట్రిక్ కి మొదటి మూవీగా మారాల్సిన డ్రాగెన్ వేగానికి కళ్లెంపడింది. 1000 కోట్లు కాదు, ఈజీగా రెండు వేలకోట్లు రాబడుతుందనే అంచనాలున్న ఈ సినిమాకు మరో వెయ్యికోట్లు మూవీనే బ్రేక్ వేసింది. అదే వార్ 2….
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మూవీ వార్ 2.. లాస్ట్ రెండు షెడ్యూల్స్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లు, క్లైమాక్స్ ఫైట్ సీన్లు తీస్తే ఆల్ మోస్ట్ మూవీ పూర్తవుతుంది. పెండింగ్ సాంగ్స్ షూటింగ్ ని జనవరిలో ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది… కాకపోతే జనవరిలోగా ఎలాగైనా వార్ 2 సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నారు.
గ్రాఫిక్స్ వర్క్ కి 5 నెలల టైం పడుతుంది కాబట్టి, జనవరిలోగా వార్ 2 షూటింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వేశారు. లేదంటే నవంబర్ లో భారీ ఎత్తున 22 రోజులు డ్రాగన్ మూవీ తాలూకు షెడ్యూల్ కంటిన్యూ చేయాల్సి వచ్చేది. ఏదేమైనా 80శాతం పూర్తైన వార్ 2 పెండింగ్ షూటింగ్ కోసం, డ్రాగన్ షూటింగ్ ని వాయిదా వేసి, ఎన్టీఆర్ ఇలా తన మూవీకోసం తానే త్యాగం చేశాడు…